Pan India Movies: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో పోటీపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే ఎన్నో బడా చిత్రాలు వచ్చి ప్రాంతీయంగా సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇటు పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాలు మంచి కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. ఇకపోతే గడిచిన చిత్రాలను పక్కన పెడితే.. ఇప్పుడు త్వరలో వచ్చే రెండు మూడు సంవత్సరాలలో భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకు సిద్ధం కాబోతున్నాయి. మరి ఈ చిత్రాలు ఏ మేరా కలెక్షన్లను రాబట్టవచ్చు అనే ఒక ఎస్టిమేషన్ లిస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
మరి ఏ చిత్రం ఎన్ని కోట్లు రాబడుతుంది అనే లెక్కలు ఇప్పుడు ఒకసారి చూద్దాం..
నితీష్ తివారి దర్శకత్వంలో యష్ రావణుడిగా, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణం. సుమారుగా 4వేల కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచంలోనే అత్యధిక బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. ఇకపోతే ఈ సినిమా మొదటి భాగం 1500 కోట్లు రాబట్టవచ్చు అని అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్. ఈ చిత్రం ద్వారానే షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 800 కోట్ల వరకు రాబట్టవచ్చు అని సమాచారం.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం జైలర్. గతంలో రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ జైలర్ 2 రాబోతోంది. ఈ సినిమా 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టవచ్చు అని అంచనాలు ఉన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న చిత్రం జననాయగన్. ఈ సినిమా ఖచ్చితంగా 650 కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విడుదల తేదీ పై కాస్త అనుమానాలు ఉన్నా.. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 350 కోట్లు రాబడుతుందని అంచనా.
హను రాఘవపూడి దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా, ఇమాన్వి హీరోయిన్గా రాబోతున్న చిత్రం ఫౌజీ.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది ఆగస్టు 14న విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం కచ్చితంగా 450 కోట్లు రాబడుతుందని సమాచారం.
టాక్సిక్ – 400 కోట్లు
పెద్ది – 270 కోట్లు
బోర్డర్ 2 – 650 కోట్లు
ఎన్టీఆర్ నీల్ – 600 కోట్లు
బాటిల్ ఆఫ్గల్వాన్ – 300 కోట్లు
లవ్ అండ్ వార్ – 500 కోట్లు
అయితే ఈ లెక్క పెరగొచ్చు లేదా తగ్గవచ్చు. కంటెంట్ పైన ఆధారపడి ఉంటుంది అనే విషయం గమనించాలి.
ALSO READ:Kalyani Priyadarshan: కల్కి సినిమాలో ఛాన్స్.. కళ్యాణి రియాక్షన్ అదుర్స్!