Hong Kong Sixes 2025: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మధ్య మ్యాచ్ అంటే జనాలందరూ ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితిలే ఉన్నాయి. అందుకే ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే ఎంతో ఆసక్తిగా జనాలు చూస్తారు. దానికి తగ్గట్టుగానే ఇవాళ ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అది కూడా ఆరు ఓవర్ల మ్యాచ్ కావడం విశేషం. హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ జరగనుంది.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ లో ( Hong Kong Sixes 2025) భాగంగా ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హాంకాంగ్ లోని మిషన్ రోడ్ గ్రౌండ్ ( Mission Road Ground, Mong Kok) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభమవుతుంది. ఆరు ఓవర్ల మ్యాచ్ కావడంతో దాదాపు 60 నిమిషాల్లో మ్యాచ్ ఫినిష్ చేస్తారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గా దినేష్ కార్తీక్ వ్యవహరిస్తాడు. అటు పాకిస్తాన్ కెప్టెన్ గా అబ్బాస్ ఆఫ్రిది కొనసాగుతాడు. హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్ లో ఉచితంగానే చూడొచ్చు.
హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. కేవలం రెండు రోజులు అంటే నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 12 అంతర్జాతీయ క్రికెట్ జట్లు పాల్గొంటాయి. ఈ 12 జట్లను నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ సీ లో ఇండియా, పాకిస్తాన్, కువైట్ ఉన్నాయి. కేవలం 6 ఓవర్ల మ్యాచ్ ఇందులో నిర్వహిస్తారు. అంతేకాదు ఒక్క జట్టులో ఆరుగురు ప్లేయర్లు మాత్రమే ఉంటారు. ఈ మ్యాచ్ లో 6 ఓవర్లు ఉంటాయి కాబట్టి వికెట్ పేపర్ మినహా మిగతా ఐదుగురు బౌలర్లు తల ఒక ఓవర్ వేయాలి. ఒక బౌలర్ రెండు ఓవర్లు అదనంగా వేయాల్సి ఉంటుంది. అలాగే ఒక బ్యాట్స్ మెన్ 50 పరుగులు చేస్తే వెంటనే రిటైర్డ్ నాటౌట్ కావాల్సిందే. ఒకవేళ అందరూ ఆటగాళ్లు ఔట్ అయితే అతను మళ్లీ బ్యాటింగ్ చేయవచ్చు.
టీమిండియా: దినేష్ కార్తీక్ (కెప్టెన్) (కీపర్) భరత్ చిప్లి, రాబిన్ ఉతప్ప, ప్రియాంక్ పంచాల్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, షాబాజ్ నదీమ్,
పాకిస్థాన్ : ఖవాజా నఫే (కీపర్), అబ్బాస్ అఫ్రిది (కెప్టెన్) అబ్దుల్ సమద్, సాద్ మసూద్, మాజ్ సదాకత్,
ముహమ్మద్ షాజాద్, షాహిద్ అజీజ్,
90’s generation will remember waking up early to tune into Hong Kong sixes watching Robin Singh, Kanitkar, Atul Wasan, Nikhil Chopra.
The tournament is back with a bang – India vs Pakistan today!
Streaming live on FanCode – https://t.co/KKQ9M01ASp#HongKongSixesOnFanCode pic.twitter.com/72OPq2U7ss
— Johns. (@CricCrazyJohns) November 7, 2025
India's squad for Hong Kong Sixes 2025 🇮🇳🔥
Led by the ever-reliable Dinesh Karthik 🧤©️💪
Experience. Skill. Entertainment guaranteed! ⚡🏏 pic.twitter.com/rNkCjVgRxT
— CricketGully (@thecricketgully) November 5, 2025