Maganti Family Issue: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గోపినాథ్ మృతిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. గోపీనాథ్‌కు జరుగుతున్న చికిత్స వివరాలను బయటకు చెప్పలేదని.. కనీసం ఆస్పత్రి పరిసరాల్లోకి కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కొడుకు మృతిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్..
హాస్పిటల్‌లో గోపీనాథ్‌ను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్‌కు కలిసి, తమను లోపలికి అనుమతించలేదని చెప్పినా ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడతానని చెప్పిన కేటీఆర్.. కొద్దిసేపటి తర్వాత మరో మార్గం నుంచి కనిపించకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. అసలు తన కుమారుడు చనిపోయినా కూడా వెంటిలేటర్‌పై పెట్టారా? కేటీఆర్ వచ్చి వెళ్లిన తర్వాత గోపీనాథ్ చనిపోయినట్లు ఎందుకు ప్రకటించారు? అన్నది తెలియాలన్నారు. దీనికి కేటీఆరే సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..
సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ.. గోపీనాథ్ మొదటి భార్య మాలినిదేవి అభ్యంతరం
మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడంపై గోపీనాథ్ మొదటి భార్య మాలినిదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దీనిపై గురువారం విచారణ జరపగా.. గోపీనాథ్ తల్లి మహానందకుమారి, మొదటి మాలినిదేవి సహా ఆమె కుమారుడు తారక్ ప్రద్యమ్న విచారణకు హాజరయ్యారు. ఇటు మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న తారక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫాదర్-మదర్ పెళ్లి ఫోటోలు సమర్పించానన్నారు. బెదిరించడం వల్లే బయటకు రాలేకపోయామన్నారు. తనకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధంలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ కేసులో పొలిటీషియన్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారో తనకు తెలియదన్నాడు. తండ్రి గోపినాథ్‌తో మంచి రిలేషన్ ఉందని చెప్పాడు.