Quinton de Kock : సౌతాఫ్రికా ఆటగాడు డికాక్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్ జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో సౌతాఫ్రికా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ ను 1-1 సమం చేసింది దక్షిణాఫ్రికా జట్టు. క్వింటాన్ డికాక్ 119 బంతుల్లో 123 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
Also Read : WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్నమెంట్ షెడ్యూల్ ఇదే..!
ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో అయూబ్ (53), సల్మాన్ అఘా (69), నవాజ్ (59) హాఫ్ సెంచరీలు చేశారు. అయితే సౌతాఫ్రికా బౌలర్లు నాండ్రె బర్గర్ 4 వికెట్లు, పీటర్ 3 వికెట్లను పడగొట్టారు. సౌతాఫ్రికా జట్టు 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 119 బంతుల్లో 123 పరుగులు చేశాడు డికాక్. అందులో 8 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా డికాక్ గెలుచుకున్నాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన డికాక్.. రెండో వన్డే సెంచరీ సాధించడంతో పాటు పలు రికార్డులను సృష్టించాడు. వెల్కమ్ బ్యాక్.. క్వింటన్ డికాక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో వికెట్ కీపర్లు సాధించిన అత్యధిక సెంచరీలలో డికాక్ రెండో స్థానంలో ఉన్నాడు. కేవలం ఒక సెంచరీ సాధిస్తే.. శ్రీలంక క్రికెటర్ సంగక్కర రికార్డును సమం చేయనున్నాడు డికాక్. ప్రస్తుతం సంగక్కర 23 సెంచరీలు చేసి టాప్ లో కొనసాగుతుండగా.. క్వింటన్ డికాక్ 22 సెంచరీలు సాధించాడు. డికాక్ చరిత్ర సృష్టించడానికి కేవలం 1 సెంచరీ దూరంలోనే ఉన్నాడు.
వేగంగా 22 వన్డే సెంచరీలు చేసిన వారిలో డికాక్ నాలుగో స్థానంలో ఉన్నాడు. హషీమ్ ఆమ్లా 126 ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ 143, డేవిడ్ వార్నర్ 153, క్వింటన్ డికాక్ 157, అబ్ డివిలియల్స్ 186, రోహిత్ శర్మ 188 ఇన్నింగ్స్ లు ఆడి 22 సెంచరీలు చేసిన వారిలో చేరారు. డికాక్ మరో రెండు సెంచరీలు చేస్తే.. వరల్డ్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. వికెట్ కీపర్లలో ఇప్పటికే టాప్ 2లో కొనసాగుతున్నాడు. మరోవైపు డికాక్ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ, రెండో మ్యాచ్ లో సెంచరీ చేయడంతో పలువురు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌతాఫ్రికా జట్టు అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో సత్తా చాటి పాకిస్తాన్ ను చిత్తు చేసింది. చివరి వన్డే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే.. ఆ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. పాకిస్తాన్ కంటే ఎక్కువగా సౌతాఫ్రికా జట్టుకే విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. డికాక్ మంచి ఫామ్ లో ఉండటం ఆ జట్టుకు సానుకూలంగా కలిసి వస్తోందనే చెప్పవచ్చు.
Also Read : IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్టన్, కంగారులపై టీమిండియా విజయం
– He announced his retirement.
– He comes out from retirement.
– Scored fifty in 1st ODI Vs PAK.
– Now Hundred in 2nd ODI Vs PAK.WELCOME BACK, QUINTON DE KOCK. 🫡🙌 pic.twitter.com/WUuhUWxriJ
— Tanuj (@ImTanujSingh) November 6, 2025