మనుషులలో మానవత్వం చనిపోయిందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మహిళను చూసి అయ్యో పాపం అనాల్సిందిపోయి, ఆమె చేతికున్న గాజులు దోచుకెళ్లిన అనుమానుష ఘటన. ఈ దారుణం ముంబైలో జరిగింది. తాజాగా కుర్లాలో బస్సు ప్రమాదం జరిగింది. డ్రైవర్ బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్‌ను తొక్కడంతో బస్సు ముందుకు దూసుకెళ్లింది. ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొడుతూ ముందుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా, 40 మంది గాయపడ్డారు. 22 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ యాక్సిడెంట్ ముంబైలో సంచలనం రేపించింది.
చనిపోయిన మహిళ బంగారు గాజులు కొట్టేసిన దుండగుడు
ఈ ప్రమాదంలో కానిస్ ఫాతిమా అన్సారీ అనే మహిళ బస్సు కింద పడిపోయింది. ఆమెను సుమారు 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఆమె అక్కిక్కడే చనిపోయింది. మృతి చెందిన మహిళను బయటకు లాగుతున్నట్లు నటిస్తూ, ఓ వ్యక్తి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను కొట్టేశాడు. హెల్మెంట్ ధరించిన వ్యక్తి ఆమె బ్యాంగిల్స్ కొట్టేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందులో ‘హాత్ మే గోల్డ్ హై’ అనే వాయిస్ సీసీ ఫుటేజీలో స్పష్టంగా వినిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాజులు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ముంబై పోలీసులు వెల్లడించారు.
यह तस्वीरें शर्मनाक है..
कुर्ला बस हादसे में एक महिला की मौत हो गई और कुछ लोग लाश के हाथों से उसके जेवरात को उतारते दिख रहे है..
ना जाने कौन है यह लोग, जो यह सब कर रहे है..#KurlaBusAccident #Mumbai pic.twitter.com/b8cMpMVOol
— Vivek Gupta (@imvivekgupta) December 12, 2024
నిజంగా దురదృష్టకరం- మృతురాలి కొడుకు
చనిపోయిన తన తల్లి చేతులకు ఉన్న బంగారు గాజులు కొట్టేయడం దురదృష్టకర ఘటనగా ఆమె కొడుకు అబిద్ తెలిపారు. “నిజంగా ఇది దురదృష్టకర సంఘటన. చనిపోయిన మనుషుల ఒంటి మీద నగలు కొట్టేయడం అమానుషం. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకక పోలీసులకు ఫిర్యాదు చేశాం. అలాంటి వారికి పోలీసులు తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. అదే సమయంలో మా అమ్మగారి గాజులు మాకు చేరేలా చూడాలని కోరుతున్నాం” అన్నారు.
డ్రైవర్ పొరపాటుతో ఘోర ప్రమాదం
బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్(బెస్ట్) నిర్వహిస్తున్న బస్సు అదుపు తప్పి 22 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 42 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ సంజయ్ మోరే పొరపాటు కారణంగా ఈ ఘోరం జరిగింది. కుర్లా వెస్ట్ లో డ్రైవర్ పొరపాటును బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు డ్రైవర్ గతంలో మాన్యువల్ కంట్రోల్ తో కూడిన మినీ బస్సును నడిపాడని చెప్పారు. డిసెంబర్ 1న బెస్ట్ బస్సు డ్రైవర్ గా విధుల్లో చేరాడు. మాన్యువల్ బస్సునడిపిన ఆయన ఆటోమేటిక్ బస్సు నడపడంలో తడబాటుకు గురికావడంతో ఈ దారుణం జరిగింది. ముంబై పోలీసులు డ్రైవర్ ను అరెస్టు చేయగా.. కోర్టు అతడికి డిసెంబర్ 21 పోలీస్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The CCTV footage of the #BESTBus that mowed down seven persons in #Mumbai’s #Kurla area shows driver #SanjayMore collecting two backpacks from the cabin and jumping out of a broken window after the accident. Four to five video clips with a duration of 50 seconds to over 1 minute… pic.twitter.com/dLML17d9JF
— Hate Detector 🔍 (@HateDetectors) December 12, 2024
Read Also: ‘లక్కీ భాస్కర్’ ఎఫెక్ట్.. హాస్టల్ గోడదూకి పారిపోయిన స్టూడెంట్స్!