Illu Illalu Pillalu Today Episode November 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ సేనాపతి పై కోపంగా ఉంటాడు.. ధీరజ్ ప్రేమ లోపలికి రాగానే మీ నాన్న కొంచెమైనా బుద్ధుందా? తాగేసి కూతురు వయసు అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడో చూసావా అని అంటాడు. అయితే ఇంకా విషయం గురించి వదిలేయ్ రా నీ ప్రేమ అంటుంది.. ప్రేమ ఎంత చెప్తున్నా కూడా ధీరజ్ పదేపదే ఆ విషయం చెప్పడంతో ప్రేమ సీరియస్ అయ్యి ఇద్దరు కొట్టుకుంటారు.. ఇక తర్వాత సేన అన్న మాటలను తలుచుకొని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నర్మదా ఏంటి అత్తయ్య ఇంత పొద్దుకైనా కూడా మీరు ఇంకా పడుకోలేదు రండి.. పడుకుందురు అని అంటుంది. నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. వాళ్ల జోలికి మాత్రం వెళ్లోద్దని చెప్తుంది. నేను ఏమి తప్పు చేయట్లేదు అత్తయ్య నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటున్నాను రూల్స్ ప్రకారం నేను నడుచుకుంటున్నాను అని నర్మదా అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే నర్మదా ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అయ్యి వంట గదిలోకి వస్తుంది. వేదవతి మౌనంగా వంటకి కట్ చేసుకుంటూ ఉంటుంది. నర్మదా ఏంటి అత్తయ్య మాట్లాడరా మీరు మొహం ముడుచుకుంటే మీ బుగ్గలు ఎర్రగా కందిపోతున్నాయి. మీరు మాట్లాడండి అక్కయ్య నేను నా ఉద్యోగాన్ని మాత్రమే చేసుకుంటున్నాను.. నా గురించి ఏమీ భయపడకండి అని నర్మదా అంటుంది. ఈ ప్లీస్ అత్తయ్య మీరు నాతో మాట్లాడుకున్న అంటే నాకు ఈ రోజు ఏదో ఒకటి జరుగుతుంది అని నర్మదా అంటుంది. ఎంత బ్రతిమిలాడిన సరే వేదవతి మాట్లాడదు నర్మదా అలానే ఆఫీస్ కి వెళ్ళిపోతుంది.
ఇక ఆఫీస్ కి వెళ్ళగానే అక్కడ ఒక వ్యక్తి వచ్చి నేను భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేడం మీరు కాస్త డాక్యుమెంట్స్ చూడండి అని అడుగుతాడు.. ఇది ఆ డాక్యుమెంట్స్ లో ఇవ్వండి అని నర్మదా చెక్ చేస్తూ ఉంటుంది. వాటిని చూడగానే ఇవన్నీ తప్పుగా ఉన్నాయండి రిజిస్ట్రేషన్ నెంబర్ సర్వే నెంబర్లు కూడా ఇందులో కరెక్ట్ గా లేవు అని అంటుంది.. లేదు మేడం మీరు చివరి పేజి వరకు చూడండి అని అనగానే అందులో డబ్బులు కనిపించి ఏంటిది లంచం ఇవ్వాలని అనుకుంటున్నావా? ఏంటిది అని అడుగుతుండగానే ఏసీబీ వాళ్ళు అక్కడికి వస్తారు. మేడం మీరు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు అని అంటారు.
నేను ఎప్పుడూ అలాంటి పని చేయలేదు సార్ వాడు కావాలనే చేస్తున్నాడు.. ఏంట్రా ఇదంతా అని నర్మదా అతన్ని బెదిరించేలా మాట్లాడుతుంది. ఏంటి మేడం మీరు మామూలే బెదిరించేలా మాట్లాడుతున్నారు. దీనికి కూడా మీకు కేస్ అవుతుంది తెలుసా అని వాళ్ళ ఆఫీసర్లు అడుగుతారు.. ఇక నర్మదా చేసేది ఏమీ లేక మౌనంగా ఉండిపోతుంది. మీరు రిమాండ్ కి రావాల్సి వస్తుంది ఇక్కడ సైన్ చేయండి అని నర్మదతో వాళ్ళు అంటారు.. నర్మదా మౌనంగా వాళ్లతో వెళ్లిపోతుంది..
ఆనందరావు ఇద్దరు కూడా సంతోషంగా పిండి వంటలు తింటూ ఉంటారు.. శ్రీవల్లి అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకొని లగ్జరీగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు కదా అని అంటుంది. ఈ పాటలు ఏంటి ఇలా ఉన్నాయి వేరేది ఏదైనా పెట్టుకోవాలని ఆనందరావు అనుకుంటాడు.. అప్పుడే న్యూస్ ఛానల్ లో నర్మదా అరెస్టు అన్నట్లు వస్తుంది.. అది చూసిన శ్రీవల్లి ఆ న్యూస్ ఛానల్ పెట్టు అని గోల చేస్తుంది.. ఆ న్యూస్ ఛానెల్ పెట్టగానే నర్మదా గురించి న్యూస్ రావడం చూసి శ్రీవల్లి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. అంతే కాదు లంచం తీసుకుంటూ దొరికిపోయిందని వార్తను విని భాగ్యం ఆనందరావు శ్రీవల్లి ముగ్గురు కలిసి డ్యాన్సులు వేస్తారు.
ఈ విషయాన్ని అందరికీ చెప్పాలని అనుకుంటారు. కేకలు వేసి మరి అందర్నీ పిలుస్తుంది. న్యూస్ ఒకసారి చూడండి నర్మదా లంచం తీసుకుంటూ దొరికిపోయింది అంట అని అంటుంది. ఏంటి వదిన లంచం తీసుకోవడమేంటి అని ధీరజ్ అనగానే.. లంచం తీసుకునే వాళ్ళు కనిపించరు అందుకే లంచం తీసుకొని దొరికిపోయింది అని శ్రీవల్లి అంటుంది. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా శ్రీవల్లి అని అరుస్తారు. ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావ్. నువ్వు చూసావా అని శ్రీవల్లి పై వేదవతి సీరియస్ అవుతుంది. ఈ విషయం గురించి మీ నాన్నను అడిగి తెలుసుకోవాలి ముందు మీ నాన్నకు ఫోన్ చేయరా అని వేదవతి అంటుంది.
నాన్న ఫోను కలవలేదు. నాట్ రీచబుల్ వస్తుందమ్మా అని అంటాడు. ఒకసారి నర్మదకు ఫోన్ చేసి ఏమైందో కనుక్కోరా అని అంటుంది. నర్మదకి ఫోన్ చేస్తే నాకు సరే లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తాడు. నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు ఏంటి ఇలా జరిగింది అందుకే లేనిపోనివి మీద వేసుకోవద్దని అన్నాను. అంటూ వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది.. అయితే శ్రీవల్లి భాగ్యం బయటికి వచ్చి మరి నర్మదా అరెస్ట్ చేశారని డాన్సులు వేస్తూ ఉంటారు.
Also Read : పల్లవికి షాకిచ్చిన మీనాక్షి.. కమల్ దెబ్బకు పల్లవికి మైండ్ బ్లాక్.. అవనికి తండ్రి ఎవరో తెలుస్తుందా..?
చాలా సంతోషంగా ఉందమ్మా నర్మదా ఇన్ని రోజులు రెచ్చిపోయింది. ఇకమీదట నుంచి కుక్కిన పెనులాగా పడి ఉంటుంది అని శ్రీవల్లి అంటుంది. అలాగే భద్రావతి సేన ఇద్దరు కూడా లంచం తీసుకుంటూ రిజిస్టర్ ఆఫీసర్ దొరికిపోయారు అని సంతోష పడుతూ ఉంటారు. మనతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. మన గురించి తెలిసి కూడా ఆ నర్మదా పులి లాగా రెచ్చిపోయింది. ఇప్పుడు మాత్రం మన పేరు వింటే భయపడుతుందిలే అక్క అని సేన అంటాడు. ఏంటి ఆఫీసరేనా మనకు కనుసైగలతో పని చేసి పెట్టాలి అలాంటిది మన ముందే తోకజాడిస్తుందా అని భద్ర అంటుంది.. ఇప్పుడు ఆ నర్మద మొహం ఎలా ఉందో చూడాలి రా అని భద్రావతి అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..