Defecting MLAs: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ కంటిన్యూ అవుతోంది. నిన్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్‌తో పాటు పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, జి. జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్ తరఫు న్యాయవాదులు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరెకపూడి గాంధీ పిటిషన్లపై విచారణ..
ఇక ఇవాళ మరో ఇద్దరు ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగనుంది. ఉదయం 11గంటలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ మాజీమంత్రి జగదీష్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది. పోచారంపై జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్ వేసిన జగదీశ్‌రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్..
ఈ మేరకు పిటిషన్ వేసిన జగదీష్ రెడ్డిని పోచారం తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వర్సెస్ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగనుంది. పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత విచారణ వాయిదా పడనుంది. తిరిగి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలను పిటిషనర్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
Also Read: నా కొడుకు ఎలా చనిపోయాడో కేటీఆర్ చెప్పాలి? మాగంటి తల్లి బ్లాస్ట్..
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు..
మరో వైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గత నెలలో విచారణ జరపగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈనెల 12న కేపీ వివేకానంద వర్సెస్ తెల్లం వెంకట్రావు, జగదీష్ రెడ్డి వర్సెస్ సంజయ్, ఈనెల 13న జగదీష్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరికపూడి గాంధీ న్యాయవాదుల మధ్య వాదనలు క్రాస్ ఎగ్జామినేషన్ జరుగునున్నది. దీనితో ఎనిమిది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కానుంది.
నేడు రెండవ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ..
నిన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులను విచారించిన స్పీకర్
నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ కేసులను విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
ఉదయం 11 గంటలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి Vs… pic.twitter.com/Lp9BBf5BZh
— BIG TV Breaking News (@bigtvtelugu) November 7, 2025