sriya reddy (1)
Sriya Reddy Latest Photos: ప్రభాస్-ప్రశాంత్ నీల్ సలార్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది నటి శ్రియా రెడ్డి. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అయ్యారు. ఇప్పుడు త్వరలోనే ఆమె ఓజీతో మరోసారి ఫ్యాన్స్‌ని అలరించబోతుంది.
sriya reddy (2)
పొగరు, అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది వంటి చిత్రాలతో శ్రియా మంచి గుర్తింపు పొందింది. యాటిట్యూడ్ రోల్స్‌లో శ్రియా అద్బుతమైన నటనతో ఆడియన్స్ మనసులో నిలిచింది. ముఖ్యంగా పొగరు సినిమాలో ఆ నటన ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటుంది.
sriya reddy (3)
నెగిటివ్ షేడ్స్‌లో అంతగా ఒదిగిపోయిన ఈ భామ హీరోయిన్గా గ్లామర్ షో చేసింది. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె అమ్మ చెప్పింది పోలీసు ఆఫీసర్‌గా నటించి మెప్పించింది. అలా గ్లామరస్ పాత్రలకే పరిమితంగా కాకుండా.. పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్ ఎంచు కుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది.
sriya reddy (4)
ఇక ఇప్పుడు ఓజీలో మరో పవర్ఫుల్ రోల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ట్రైలర్లో శ్రియా రెడ్డి పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే ఓజీ ప్రీ-రిలీజ్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రమోషనల్ ఫోటోషూట్ లో పాల్గొంది.
sriya reddy (5)
ఇందులో ఆమె లుక్ నెటిజన్స్ ఆకట్టుకుంది. వైట్ బ్యాగ్రౌండ్ శారీపై మల్టీకలర్ ప్లవర్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ చీరలో శ్రియ తన హాట్ ఫోజులతో మరింత అందం తెచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి.