Divvela Madhuri: ప్రముఖ సినీ నటుడు నాగార్జున (Nagarjuna)వ్యాఖ్యతగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికీ ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదవ సీజన్ ప్రసారం అవుతుంది. ఇప్పటికే ఈ సీజన్ 2 వారాలను పూర్తి చేసుకుంది. 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 6,7వ తేదీలలో వైల్డ్ కార్డు ద్వారా మరి కొంత మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.
ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టే వారికి సంబంధించి వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వారిలో దివ్వెల మాధురి(Divvela Madhuri) కూడా ఒకరని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి నిజానికి ఈమె బిగ్ బాస్ 9(Bigg Boss 9)ప్రారంభం రోజే హౌస్ లోకి వెళ్ళిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదని తెలియడంతో వైల్డ్ కార్డు ద్వారా పక్కా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి వస్తున్న ఈ వార్తలపై మాధురి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
నా రాజాతో ఉండటమే ఇష్టం…
తాను వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నాను అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. నిజానికి నన్ను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొనమని నిర్వాహకుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అయితే నేను నా రాజా (దువ్వాడ శ్రీనివాస్) ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను అందుకే బిగ్ బాస్ అవకాశాన్ని కూడా వదులుకున్నానని తెలిపారు. నాకు రోజంతా శ్రీనివాస్ (Duvvada Srinivas)తోనే ఉండటం ఇష్టం ప్రతిరోజు ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండి పెట్టడం, తనని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడతాను.
ప్రయాణం చేయటం ఇష్టం..
నెలలో 10 రోజులపాటు రాజకీయ వ్యవహారాలలో శ్రీనివాస్ పాల్గొంటారని, ఆ సమయంలో తన పక్కనే ఉండటం ఇష్టం, ఇక మా ఇద్దరికీ ప్రయాణాలు చేయడం అంటే కూడా చాలా ఇష్టం. అందుకే తరచూ ఇద్దరం వివిధ ప్రాంతాలకు పర్యటిస్తూ ఉంటామని మాధురి తెలిపారు. ఇలా నా రాజాని వదిలి ఎప్పుడు తాను ఎక్కడికి వెళ్లలేదని అందుకే బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా తాను వెళ్లడానికి ఇష్టపడలేదు అంటూ ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒకవేళ మాధురి హౌస్ లోకి కనక వెళ్లి ఉంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఇచ్చి ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో మాధురి శ్రీనివాస్ పేరు ఇటు వార్తలలోనూ అటు రాజకీయాలలోనూ మారుమోగుతున్న సంగతి తెలిసిందే.. ఇక దువ్వాడ శ్రీనివాస తన భార్య వాణిని వదిలి మాధురి వద్ద ఉండటంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
Also Read: Kalki 2 : దీపిక ప్లేస్‌లో స్వీటీ… మళ్లీ పెళ్లి వార్తలు వచ్చేస్తాయేమో