Bigg Boss 9 Telugu Day 60 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 60 ఎపిసోడ్ 61లో దొంగలెవరో తేలిపోయింది. ఇక రీతూ తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ ను మడతెట్టేసింది. మరి ఈరోజు ఎపిసోడ్ లో జరిగింది ఏంటి? కెప్టెన్సీ కంటెండర్లు ఎవరు? ప్రోమోలలో చూపించిన రచ్చకు కారణం ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ రివ్యూలో తెలుసుకుందాం.
నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ రెబల్స్ ఎవరో కనిపెట్టే ఛాన్స్ ను హౌస్ మేట్ కు ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్లనే కంటెండర్ రేసులో నుంచి తప్పిస్తానని బిగ్ బాస్ వెల్లడించాడు. తనూజా అతి తెలివితో గౌరవ్ పేరు చెప్పింది. కనీసం రెబల్ ఎవరు అని ఆలోచించకుండా మరో స్ట్రాంగ్ ప్లేయర్ ను ఆట నుంచి తొలగించాలి అనుకున్నారు. ఇంకేముంది అందరూ కలిసి గౌరవ్ ను ఆట నుంచి తప్పించారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ రీతూ ను రెబల్ ను చేశారు. హౌస్ మేట్ లలో ఎవరో ఒకరితో సీరియస్ గా గొడవ పడాలని సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చారు. ఇదే మంచి అవకాశం అని రీతూ వీర లెవెల్ లో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇమ్మూతో వాష్ రూమ్ లోనే గొడవ వేసుకుంది. నువ్వు డెమోన్ ను తీసేసి ఉండకపోతే మేము టాస్క్ విన్ అయ్యే వాళ్ళము అంటూ నెమ్మదిగా మొదలెట్టింది. దీంతో అందరూ నన్నే అంటారు ఏంటి? అది నా ఒక్కడి డెసిషన్ కాదంటూ ఫైర్ అయ్యాడు. కానీ రీతూ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళంతా కాదు నువ్వూ, నీ టీం తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. మీరు మాటిచ్చి వెన్నుపోటు పొడిచారు అంటూ సాగదీసింది. దీంతో ఆమె సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయ్యింది. కానీ మరో టాస్క్ లో మాత్రం రీతూ ఒడిపోయింది. ఇమ్మూ ఫ్యామిలీ ఫోటోను సీక్రెట్ గా దాచాలనేది ఆ టాస్క్. కానీ దానిని చేయలేకపోయింది రీతూ.
‘రెయిజ్ ది ఫ్లాగ్’ అనే వాటర్ టాస్క్ లో భరణి-రీతూ బ్లూ టీం, దివ్య – సుమన్ శెట్టి పింక్, ఇమ్మాన్యుయేల్ -గౌరవ్ లు ఆరెంజ్ టీం నుంచి ఆడగా, ఇమ్మూ టీం విన్ అయ్యింది. అయితే టాస్క్ విన్ అయ్యాక వచ్చే గ్రీన్ కార్డును ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఆరెంజ్ టీంలో రచ్చ మొదలైంది. మొదటి రౌండ్ లో ఇమ్మూకి, సెకండ్ రౌండ్ లో తనూజాకు ఇచ్చారు. కాబట్టి ఈ రౌండ్ తో తనకే ఆ కార్డు కావాలని గౌరవ్ పట్టుబట్టాడు. కానీ ఇంతదూరం వచ్చాక నాకు రిస్క్ తీసుకోవాలని లేదని ఇమ్మూ పుల్ల వేశాడు. కానీ గౌరవ్ పట్టు వదల్లేదు. చేసేదేం లేక ఇమ్మూ ఆ సేఫ్ కార్డును గౌరవ్ కి ఇచ్చేశారు. కానీ మళ్ళీ అందరూ కలిసి అతన్నే కంటెండర్ లిస్ట్ నుంచి తీసేశారు.
ఆ తరువాత బిగ్ బాస్ రెబల్స్ ను అనౌన్స్ చేశారు. అలాగే మిమ్మల్ని మేమే తీసేశాము అని దివ్య చెప్తే, విచిత్రంగా ‘నాకు తెలుసు’ అంటూ కళ్యాణ్ ఒక వెరైటీ నవ్వు నవ్వి వదిలేశాడు. కెప్టెన్ కంటెండర్స్ రేసులో చివరికి దివ్య, సుమన్, ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి, రీతూ ఉన్నారు.
Read Also : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?