BigTV English
Advertisement

The Girlfriend Movie Review : ది గర్ల్ ఫ్రెండ్ రివ్యూ..

The Girlfriend Movie Review : ది గర్ల్ ఫ్రెండ్ రివ్యూ..

The Girlfriend Movie Review : రష్మిక… నేషనల్ క్రష్ అనే కాదు, పాన్ ఇండియా హీరోయిన్ అనే పేరు కూడా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ 100 కోట్లు కొట్టిన 6 సినిమాల్లో హీరోయిన్ రష్మిక మందన్నా. అలాంటి హీరోయిన్ రష్మిక ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. అదే ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీనికి రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఆయన గతంలో డైరెక్ట్ చేసిన చిలాసౌ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి ఈ ఇద్దరు కలిసి చేసిన ఈ మూవీ ఏ స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం…


కథ :

భూమా దేవీ (రష్మిక మందన్నా) తల్లి లేని అమ్మాయి. పితృస్వామ్య వ్యవస్థలో ఉండే ఫాదరే ఇక్కడ భూమా దేవీ ఫాదర్ (రావు రమేష్). ఎప్పుడూ తండ్రి దగ్గరే ఉండే భూమా దేవీ ఫస్ట్ టైం.. తండ్రిని వదిలి.. పీజీ కోసం నగరంలో ఉండే రామలింగయ్య పీజీ కాలేజీ‌లో జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) జాయిన్ అవుతారు.

విక్రమ్‌‌ను దుర్గ లవ్ చేస్తే… విక్రమ్ మాత్రం భూమను లవ్ చేస్తాడు. ఏం అర్థం కానీ పరిస్థితుల్లోనే విక్రమ్‌తో భూమ లవ్‌లో పడిపోతుంది. దాని తర్వాత విక్రమ్ నుంచి భూమ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి భూమ ఎలా భయపడింది? బయట పడిన తర్వాత భూమ పరిస్థితి ఏంటి ? భూమా వాళ్ల నాన్న నుంచి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది అనేది డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ సినిమాలో చూపించాడు.


విశ్లేషణ :

రాహుల్ రవీంద్రన్‌పై నమ్మకం పెట్టుకోవచ్చు. ఎందుకంటే… 7 ఏళ్ల క్రితమే చిలాసౌ అనే సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టాడు. దీని తర్వాత మన్మధుడు 2 మూవీతో డిజాస్టర్ మూటగట్టుకున్నా.. చిలాసౌ ఎఫెక్ట్ అయితే అతనిపై ఉంది. ఇప్పుడు రష్మిక మందన్నాతో లేడీ ఓరియెంటెడ్ మూవీ అంటే.. చిలాసౌ వల్ల సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

అలా అని.. చిలాసౌ అంచనాలు పెట్టుకుని ఆ ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారనే అని చెప్పొచ్చు. లేడీ ఓరియెంటెడ్.. అందులోనూ మెసెజ్ ఇచ్చే మూవీ కదా.. రాహుల్ రవీంద్రన్ కొత్తగా ఏమైనా ట్రై చేసి మెప్పించాడా… అంటే సగం మార్కులే పడుతాయి.

ఓ వర్గం ఆడియన్స్… కొంత మంది అమ్మాయిలు కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఓ మంచి మెసెజ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు. కానీ, దాన్ని స్క్రిన్ పై ఆసక్తిగా మలిచి చూపించడంలో రాహుల్ రవీంద్రన్ తడబడ్డాడు.

మూవీ ఫస్టాఫ్ అంతా… ల్యాగ్ సీన్స్ తోనే నింపేశాడు. థియేటర్స్ లో ఆడియన్స్ పేషన్స్ కి పీజీ కంటే పెద్ద పరీక్ష పెట్టాడు. ఒక అమాయకురాలు.. కాలేజీకి వచ్చి.. ఒక టిపికల్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయితో లవ్ లో పడాల్సి వచ్చింది అనే దాన్ని చూపించడానికి డైరెక్టర్ ఫస్టాఫ్ మొత్తం తీసుకున్నాడు. ఒక సింగిల్ షార్ట్ లో సింపుల్ గా చూపించే ఛాన్స్ ఉంది ఆ మొత్తాన్ని. అలా చేయకపోవడం వల్ల… హీరోయిన్ ను హీరో టార్చర్ పెడుతాడు… ఈ సినిమా ఆడియన్స్ ను టార్చర్ పెడుతుంది అనే ఫీల్ వచ్చేలా అయిపోయింది.

ఇక సెకండాఫ్ స్టార్టింగ్ లో కూడా పెద్ద వేగం ఏం ఉండదు. కానీ, స్టోరీ నడుస్తున్నకొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక క్లైమాక్స్ అయితే బాగా డిజైన్ చేసుకున్నాడు. ఓ వర్గం ఆడియన్స్ బానే కనెక్ట్ అవుతారు దానికి. అలాగే సాధారణ ఆడియన్స్ కి కూడా ఓ సాటిస్ఫై క్లైమాక్స్ అని చెప్పొచ్చు.

ఇది పక్కన పెడితే.. సినిమాలో లాజిక్స్ మాత్రం చాలా ఘోరంగా మిస్ అయ్యాయి. సినిమాలో చూపించే కాలేజీ పెద్దగానే ఉన్నా… హీరో పక్కన ఉండే ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ పీజీ స్టూడెంట్స్ లా అయితే లేరు. ఆలోచన మెచ్యూరిటీ మాత్రమే కాదు.. వారితో చెప్పించిన డైలాగ్స్ కూడా ఇంటర్ పిల్లలను గుర్తుచేసేలా ఉన్నాయి. వాళ్లను పీజీ స్టూడెంట్స్ అంటూ స్క్రీన్ పై చూపించిన టైంలో… డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ సారి హైదరాబాద్ లో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ.. నిజాం కాలేజీల్లో కొన్ని రోజులు వర్క్ షాప్ చేసి ఉంటే బాగుండు అనే సలహా రాక మానదు.

ఈ సినిమా ద్వారా మెచ్యూరిటీ అనే ఓ మెసెజ్ ఇవ్వాలని డైరెక్టర్ ప్రయత్నం చేశాడు. అలాంటి టైంలో అక్కడ ఉండే పాత్రలు.. వారి నుంచి వచ్చే డైలాగ్స్ కూడా అదే టైప్ లో ఉండాలి. హీరో పాత్ర గురించి వివరించే ప్రయత్నంలో అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ ను ఇంటర్ స్టూడెంట్స్ లా కనిపించారు.

ఫర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… రష్మిక మందన్నాకు చిన్న మైనస్ కూడా చెప్పలేం. తన భూజలపై సినిమాను నడిపించింది. ఇక దీక్షిత్ శెట్టి కన్నింగ్ ఫర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అను ఇమ్మాన్యుయేల్ ఉన్నా.. ఆ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. రావు రమేష్ ఉన్నంతలో ఒకే. కానీ, ఆ పాత్రను మరింత వాడుకోవాల్సింది. మ్యూజిక్ ఎఫెక్ట్ పెద్దగా అయితే ఏం లేదు. జస్ట్ ఒకే. కెమెరా కూడా పెద్దగా చెప్పుకునేలా లేదు. నిర్మాణ విలువలు… కూడా పర్లేదు.

ప్లస్ పాయింట్స్ :

రష్మిక మందన్నా
కాన్సెప్ట్ వరకు
క్లైమాక్స్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్ :

లాజిక్స్ మిస్ అవ్వడం
ఫస్టాఫ్
స్టోరీ, స్క్రీన్ ప్లే

మొత్తంగా.. ఇంటర్ పిల్లలతో పీజీ సినిమా చేశాడు

The Girlfriend Movie Rating : 2/5

Related News

The Great Pre Wedding Show Movie Review : ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ రివ్యూ

Mass Jathara Movie Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ – ‘క్రాక్’ జాతర

Mass Jathara Twitter review : మాస్ జాతర ట్విట్టర్ రివ్యూ

Baahubali: The Epic Review : “బాహుబలి ది ఎపిక్” రివ్యూ… రెండో సారి వర్త్ వాచింగేనా?

Baahubali The Epic Twitter Review : ‘బాహుబలి ది ఎపిక్’ ట్విట్టర్ రివ్యూ..మళ్లీ హిట్ కొట్టేసిందా..?

Bison Movie Review : బైసన్ మూవీ రివ్యూ

Thamma Movie Review : థామా మూవీ రివ్యూ

Big Stories

×