Rahul Ravindran -Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా మంచి సక్సెస్ అందుకున్న సమంత (Samantha)ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. అలాగే నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో తన వ్యక్తిగత కారణాల వల్ల అనారోగ్య సమస్యల వల్ల సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడు తిరిగి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) అనే సినిమా షూటింగ్ పనులలో సమంత బిజీగా ఉన్నారు.
సమంత వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె నటుడు నాగచైతన్య(Nagachaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి విడాకులు ఇచ్చి ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నారు. అయితే సమంత నాగచైతన్య విడాకులకు గల కారణాలు ఏంటి అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. తాజాగా నటుడు రాహుల్ రవీంద్రన్ కు ఇదే విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)సమంతకు చాలా మంచి స్నేహితుడు అనే విషయం తెలిసిందే. ఆమె డిప్రెషన్ లోకి వెళ్లి అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు రాహుల్ రవీంద్రన్ ఎంతో అండగా ఉన్నారని ఆయన కారణంగానే తాను ఇలా ఉన్నాను అంటూ సమంత పలు సందర్భాలలో తెలియచేశారు.
ఇలా వీరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉందని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. తాజాగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రాహుల్ రవీంద్రన్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు సమంత గురించి ప్రశ్నలు ఎదురవడంతో సమంత నాకు ఓల్డ్ ఫ్రెండ్. మా మధ్య ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందని నేను ఏదైనా ఒక స్క్రిప్ట్ రాశాను అంటే ఆ స్క్రిప్ట్ సమంతకు ఇస్తానని ఆమె తన అభిప్రాయాలను తెలియజేస్తుందని వెల్లడించారు.
విడాకులు వారి వ్యక్తిగతం..
ఇక సమంత పర్సనల్ విషయాలు గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో తను నాకు ఒక ఫ్రెండ్ గా మాత్రమే బాగా సుపరిచితం అంతేకానీ పర్సనల్ విషయాలు (విడాకులు) గురించి ఎప్పుడు తాను అడగలేదని అది పూర్తిగా తన నిర్ణయం అని రాహుల్ వెల్లడించారు. ఇక సమంత మయోసైటిస్ వ్యాధికి గురి అయినప్పుడు ఎంతో ఇబ్బంది పడిందని, అయితే తను చాలా స్ట్రాంగ్.. అందుకే త్వరగా మామూలు స్థితికి వచ్చిందని రాహుల్ ఈ సందర్భంగా సమంత గురించి, ఆమె వ్యక్తిగత విషయాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సమంత ప్రస్తుతం నందిని రెడ్డి డైరెక్షన్ లో తన నిర్మాణ సంస్థలోనే మా ఇంటి బంగారం సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.