BigTV English
Advertisement

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

Anushka-Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. విరాట్ కోహ్లీ తనదైన ఆటతీరుతో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. తన అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం టెస్టులు, T20 లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డేలు, ఐపీఎల్ మ్యాచ్ లు మాత్రమే ఆడతానని పేర్కొన్నాడు. కాగా, ఐపిఎల్ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో కోహ్లీ ఆర్సిబి జట్టు తరఫున తన ఆటను కొనసాగిస్తున్నారు. గత సీజన్ లో ఆర్సిబి జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. 18 సంవత్సరాల తర్వాత విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా కోహ్లీకి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. కోహ్లీ, అనుష్క శర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ రూమర్ సంచలనాలు సృష్టిస్తోంది.


Also Read: Jemimah Rodrigues Trolls: ఆ దేవుడి బిడ్డే లేకుంటే, టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచేదే కాదు.. హిందువుల‌కు కౌంట‌ర్లు ?

కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఓ వార్త వైరల్ అవుతుంది. నిన్న విరాట్ కోహ్లీ పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియా వేదికగా చాలామంది క్రికెటర్లు, సినీ నటీమణులు, రాజకీయ నాయకులు విరాట్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అనుష్క శర్మ మాత్రం విరాట్ కోహ్లీకి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పలేదని ఎలాంటి పోస్ట్ షేర్ చేసుకోలేదని ఓ వార్త వైరల్ గా మారింది. ఇన్ స్టాలో కోహ్లీ ఫోటో లేకుండానే త‌న ఫోటోనే అనుష్క శ‌ర్మ పెట్టుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలు వచ్చాయని వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అంటే పడని వారే ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారంటూ కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. వారిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారని ఎలాంటి విడాకులు తీసుకోవడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.


కోహ్లీ – అనుష్క శర్మ వివాహం…!

కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ ఓ షాంపు యాడ్ షూట్ లో మొదటిసారిగా కలుసుకున్నారు. ఆ సమయంలో ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. మొదట స్నేహంగా మారిన వీరి పరిచయం అతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారింది. చాలా కాలం పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్న వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో డిసెంబర్ 11, 2017న అంగరంగ వైభవంగా వివాహం జరుపుకున్నారు. వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతున్నారు. అనుష్క శర్మ కూడా సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కోహ్లీ అనుష్క శర్మ వారి కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో సెటిల్ అయ్యారు. ఎంతో సంతోషంగా వారి పిల్లలతో కలిసి ఉంటున్నారు.

Also Read: RCB: బెంగ‌ళూరుకు కొత్త కోచ్‌..WPL 2026 టోర్న‌మెంట్‌, Mega వేలం షెడ్యూల్ ఇదే…ఆ రోజునే ప్రారంభం

 

 

 

 

Related News

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×