Bhagya Shri -Ram Pothineni: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా పి మహేష్ బాబు(Mahesh Babu) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా(Andhra King Taluka). ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే హీరో రామ్ పోతినేని , భాగ్యశ్రీ(Bhagya Shri) యాంకర్ శ్రీముఖితో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల అయింది. ఈ ప్రోమో వీడియోలో భాగంగా రామ్ , భాగ్యశ్రీ మధ్య ఎన్నో విషయాల గురించి ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక అభిమానులు రామ్ పోతినేని భాగ్యశ్రీ గురించి కొన్ని ప్రశ్నలు అడగడంతో వాటిని శ్రీముఖి ప్రశ్నిస్తూ వీరిద్దరి నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే నువ్వుంటే చాలే అనే పాట గురించి కూడా వీరిద్దరూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు .అలాగే శ్రీముఖి రామ్ పక్కన ఈ అమ్మాయి అయితే బాగుంటుందనీ ఎవరిని చూస్తే అనిపిస్తుంది అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే రామ్ ఫ్యాన్స్ ని అడ్డం పెట్టుకొని అంటూ మీరు అడగట్లేదు కదా అంటూ మాట్లాడటంతో అక్కడున్న వారు నవ్వేశారు అయితే భాగ్యశ్రీ మాత్రం నేనైతే రొమాంటిక్ కాదు రామ్ రొమాంటిక్ అన్న విధంగా మాట్లాడారు. శ్రీముఖి కూడా నేను కూడా రామ్ తో కలిసి నటించాను కానీ తనకు సిస్టర్ గా నటించాను అని చెప్పడంతో వెంటనే భాగ్యశ్రీ అయ్యో పాపం అంటూ మాట్లాడారు. ఇక ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియో నవంబర్ 8వ తేదీ ప్రసారం కానుంది.
ఇక రామ్ కెరియర్ విషయానికి వస్తే ఈయన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పలు సినిమాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేకపోయారు. రామ్ నటించిన తదుపరి సినిమాలన్నీ ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచాయి. ఇక ఆంధ్ర కింగ్ తాలూకాపై ఇప్పటికే ఎన్నో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈసారి రామ్ మంచి సక్సెస్ అందుకోబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ కి జోడిగా భాగ్యశ్రీ నటించిన నేపథ్యంలో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
భాగ్యశ్రీ తో రిలేషన్ లో ఉన్న హీరో?
రామ్ భాగ్యశ్రీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు అంటూ వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నా ఈ ఇద్దరూ మాత్రం ఈ వార్తలను ఎక్కడ ఖండించలేదు. మరి నిజంగానే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక భాగ్యశ్రీ కెరియర్ విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగ్యశ్రీ త్వరలోనే కాంత సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రమోషన్లతో పాటు, కాంత ప్రమోషన్లలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Bro 2 Movie: బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం… పవన్ కళ్యాణ్ అనుమతే ఆలస్యమా?