BigTV English
Advertisement

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 కొంతమంది కంటెస్టెంట్స్ చుట్టూనే తిరుగుతోంది. తనూజా, ఇమ్మాన్యుయేల్, సంజన, దివ్య, భరణి, రీతూ, డెమోన్, కళ్యాణ్ ఎంత బాగా ఆట ఆడుతున్నారంటే… వాళ్ళ పర్ఫార్మెన్స్ ముందు మిగతా వాళ్లకు కనీసం ఫుటేజ్ కూడా దక్కట్లేదు. అలాగే ఆటలో నెగ్గడానికి వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. బాండ్ ఉంటే తప్ప అక్కడ సర్వైవ్ అవ్వడం కష్టమని మరోసారి తేలిపోయింది. బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజా, ఇమ్మూ కలిసి గౌరవ్ కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ను తొక్కేశారు.


పాపం గౌరవ్… ఊహించని దెబ్బ

బిగ్ బాస్ డే 60 ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్లను అనౌన్స్ చేశారు. కానీ అందులో స్ట్రాంగ్ కంటెండర్లు అయిన కళ్యాణ్, డెమోన్, గౌరవ్, నిఖిల్ లకు ఛాన్స్ దక్కలేదు. వాళ్లందరినీ రెబల్స్ తీసేస్తే, గౌరవ్ ను మాత్రం సొంత టీం గెంటేసింది. ‘రెయిజ్ ది ఫ్లాగ్’ టాస్కులో విన్ అయ్యింది ఆరెంజ్ టీం. దానికి ఇమ్మూ కంటే ఎక్కువగా కష్టపడింది గౌరవ్ అని చెప్పాలి. అయితే ఆ టాస్క్ ద్వారా వచ్చిన గ్రీన్ కార్డును మాత్రం మళ్ళీ తనూజా – ఇమ్మూ తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. కానీ గౌరవ్ ఒప్పుకోలేదు. పైగా మొదటి రెండు టాస్కుల్లో మీ ఇద్దరూ సేఫ్ కారును తీసుకున్నారు. మూడో టాస్కులో కూడా ఎలా తీసుకుంటారు? న్యాయంగా చూసుకుంటే నాకు లేదా రామూకి ఆ కార్డు రావాలని ఫెయిర్ గా మాట్లాడాడు. కానీ ఇమ్మూ వినకుండా ఇంతదాకా వచ్చాక నేను రిస్క్ ఎందుకు తీసుకుంటా ? అంటూ గౌరవ్ పై పడ్డాడు. అయితే గౌరవ్ కు తెలుగు రాకపోవచ్చేమో గానీ బుర్ర మాత్రం బాగానే ఉంది, అందుకే తన పాయింట్ పై స్ట్రాంగ్ గ నిలబడ్డాడు. దీంతో ఇమ్మూకి ఆ సేఫ్ కార్డును గౌరవ్ కి ఇవ్వక తప్పలేదు. కానీ కాసేపటికే ఆ గోల్డెన్ ఛాన్స్ ను లాగేసుకున్నారు తనూజా – ఇమ్మూ.

పక్కా ప్లాన్ తో తీసేసిన ఇమ్మూ – తనూజ

రెబల్ ఎవరో గెస్ చేయమని బిగ్ బాస్ అడగ్గా… అందరూ కలిసి కావాలనే గౌరవ్ పేరు చెప్పారు. అందులో గౌరవ్ టీమ్ మేట్స్ అయిన ఇమ్మూ, తనూజా కూడా ఉండడం గమనార్హం. ముందు తనూజానే మొదలెట్టింది. ఇమ్మూతో పాటు అందరూ ఫాలో అయిపోయారు. కానీ వీళ్ళు ఇలా చేయడానికి కారణం కూడా ఉందండోయ్. అదేంటంటే గౌరవ్ కెప్టెన్సీ టాస్క్ లో ఉంటే వీళ్లకు గెలవడం కష్టం అవుతుంది. అదే ఉద్దేశంతో తనూజా – ఇమ్మూ పక్కా ప్లాన్ తో సేఫ్ కార్డు ఇచ్చి మరీ పక్కకెళ్లి ఆడుకొమ్మని పంపించారు. ఇప్పుడిప్పుడే గౌరవ్ గేమ్ కన్పిస్తోంది. కానీ ఆఖరి నిమిషాన ఇలా అతని నుంచి కెప్టెన్సీ కంటెండర్షిప్ ను లాగేసుకోవడం దారుణమైన వెన్నుపోటు. ఏదేమైనా చివరికి ఇది గేమ్. పైగా బిగ్ బాస్ షో. ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని సరిపెట్టుకోవడమే.


Read Also : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Related News

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×