Mehreen Pirzadaa: అందాల ముద్దుగుమ్మ మెహ్రీన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాతో ఈ చిన్నది తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకుంది.
ఇక మొదటి సినిమా హిట్ తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన మెహ్రీన్.. ఛాన్స్ లను అందుకుంది కానీ విజయాలను అందుకోలేకపోయింది.
ఇక ఎఫ్ 2 సినిమాతో హనీ అనే పాత్రలో మెప్పించి .. తన పేరును హనీ అని మార్చేసుకుంది.
బొద్దుగా ఉండే ఈ భామ బక్కచిక్కి.. సోషల్ మీడియాలో హీటెక్కించే ఫొటోస్ షేర్ చేస్తూ కాలం గడిపేస్తుంది.
ప్రస్తుతం ఈ చిన్నదాని చేతిలో సినిమాలు లేవనే చెప్పాలి. కొన్ని నెలలుగా కుటుంబంతో కలిసి మెహ్రీన్ వెకేషన్స్ ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా మెహ్రీన్ తన కుటుంబంతో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ను అభిమానులతో పంచుకుంది.
ఈ ట్రిప్ తన లైఫ్ లో మర్చిపోలేనిది అని చెప్తూ.. మెహ్రీన్ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇక ఫ్రెండ్స్ తో పాటు సింగిల్ గా ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేసింది.
మెహ్రీన్ ఫోటోలు చూసిన అభిమానులు సూపర్ అంటున్నారు.అంతేకాకుండా వరుస సినిమాలు చేస్తే బావుంటుందని సలహాలు ఇస్తున్నారు.