IND VS AUS 4th T20I : ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య 5 టీ-20 మ్యాచ్ ల్లో భాగంగా ఇవాళ నాలుగో టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసి 167 పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు తడబడింది. 48 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు 168 పరుగులను ఛేదించడంలో విఫలం చెందారు. ముఖ్యంగా 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా జట్టు 18.2 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్ 2, దూబే 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, అర్ష్ దీప్, బుమ్రా తలో వికెట్ తీసుకున్నారు. దీంతో భారత్ 5 టీ20 సిరీస్ లో 2-1 తేడాతో నిలిచింది. చివరి టీ-20 ఈనెల 08న జరుగనుంది.
Also Read : Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజల్..భర్తను హగ్ చేసుకుని మరీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటింగ్ ను పరిశీలించినట్టయితే అభిషేక్ శర్మ 28, శుబ్ మన్ గిల్ 46, శివమ్ దూబే 222, సూర్యకుమార్ యాదవ్ 20, తిలక్ వర్మ 5, జితేష్ శర్మ 3, వాషింగ్టన్ సుందర్ 12, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లలో గిల్, అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ రాణించడంతో టీమిండియా ఈ స్కోరు సాధించింది. ఇక 168 పరుగుల ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా టాప్, మిడిల్ ఆర్డర్ అత్యంత దారుణంగా విఫలమైంది. దీంతో 18.2 ఓవర్లలో 119 పరుగులకు కుప్పకూలింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను పరిశీలించినట్టయితే మిచెల్ మార్ష్ 30, మాథ్య్ షార్ట్ 25, ఇంగ్లీస్ 12, టిమ్ డేవిడ్ 14, జోష్ ఫిలిప్పే 10, మార్కస్ స్టోయినీస్ 17, మ్యాక్స్ వెల్ 2, డ్వార్షెష్ 5, నాథన్ ఎల్లిస్ 2, ఆడమ్ జంపా 0 పరుగులు చేశారు. దీంతో కంగారులు కంగారు పడక తప్పలేదు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ వరుస బంతుల్లో 2 వికెట్లు తీయడంతో టీమిండియా విజయం కీలకంగా మారింది.
టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో రాణించడంతో 4వ టీ-20లో విజయం సులువు అయింది. వాస్తవానికి 167 పరుగులను ఆస్ట్రేలియా జట్టు చాలా సులువుగా ఛేదిస్తోంది. టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయం అని అంతా భావించారు. కానీ భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కంగారులను కంగారు పెట్టించారు. ముఖ్యంగా భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బంతితో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న షార్ట్ ను ఔట్ చేసి భారత్ కి తొలి వికెట్ ను అందించాడు.తొలుత ఆస్ట్రేలియా ఓపెనర్లు మిచెల్ మార్ష్ 30, మాథ్యూ షార్ట్ 25 మంచి శుభారంభాన్ని అందించారు. కానీ మిడిలార్డర్ విఫలం చెందటంతో ఆస్ట్రేలియా జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చివరి టీ-20 ఈనెల 08న జరుగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుందో.. లేక ఆస్ట్రేలియా జట్టు గెలిచి సమం చేస్తుందో వేచి చూడాలి.
Also Read : Tata Motors: వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ప్లేయర్లకు టాటా బంపర్ ఆఫర్