Vastu tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వంటగది ఎంతో ముఖ్యమైనది. వంట గదిలో వాస్తు సూత్రాలను పాటిస్తే ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. వంటగదిలో ఉన్నప్పుడు చేతిలోనుంచి కొన్ని రకాల వస్తువులు జారి కింద పడడం ఏమాత్రం మంచిది కాదు. వాటిని అశుభ సంకేతంగా భావిస్తారు. ఏ వస్తువులు కింద చేతిలోంచి కింద జారి పడకూడదో తెలుసుకోండి.
ఉప్పు
వంట గదిలో ఉప్పు అనుకోకుండా చేయి జారి కింద పడితే అది అశుభానికి సంకేతం. ఉప్పును చంద్రునికి చిహ్నంగా చెబుతారు. ఉప్పు కింద పడటం వల్ల మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. మానసిక ఆందోళన కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉప్పు పడిందంటే లక్ష్మీదేవి కోపంగా ఉందని అర్థం. ఉప్పు పడిన వెంటనే చీపురుతో తుడవండి. గంగా నది నీటిలో ఆ ఉప్పును కరిగించి ఇల్లంతా చల్లుకోండి. దీని వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇలా చేస్తే ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది.
పాలు
వంట గదిలో పాల గిన్నె చేయి జారి కింద పడడం కూడా అశుభకరమే. ఎందుకంటే పాలు లక్ష్మీదేవిని పవిత్రతను సూచిస్తాయి. పాలు కింద పడడం అనేది ఇంట్లో ఉన్న పిల్లలు లేదా వృద్ధులకు అనారోగ్యం వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది. పదే పదే పాలు ఒలికిపోవడం అనేది ఇంట్లో నెగటివిటీని పెంచుతుంది. కాబట్టి పాలను జాగ్రత్తగా కింద పడకుండా చూసుకోండి.
బియ్యం
ఇంట్లో చేతిలో ఉన్న బియ్యం గిన్నె పదే పదే పడుతూ ఉన్నా ఆ బియ్యం నేలని తాకినా అది అశుభ సంకేతంగానే భావించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం బియ్యాన్ని అన్నపూర్ణ దేవతకు చిహ్నంగా భావిస్తారు. బియ్యం కింద పడడం వల్ల ఇంట్లో సంబంధాలు చెడిపోతాయని అంటారు. పడిపోయిన బియ్యాన్ని ఏరి పక్షులకు పెట్టండి. అలా ఆహార దేవతను శాంతింప చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇంట్లో శాంతి, ఆనందం వంటివి కలుగుతాయి.
నూనె
వంటగదిలో నూనె ఉండడం సహజం.ఒక్కోసారి నూనె చేజారి కింద పడుతుంది. నూనె శని గ్రహంకి సూచనగా చెప్పుకుంటారు. ఇలా నూనె జారి కింద పడుతుంది. అంటే ఇంట్లో ఉన్న వారిలో ఎవరికైనా గాయము లేదా యాక్సిడెంట్లు వంటికి జరిగే అవకాశం ఉందని సూచన. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి నూనె చేయి జారి కింద పడితే నిమ్మకాయ, ఉప్పుతో ఆ నేలను శుభ్రపరచండి. శని దేవుడు ఆశీర్వాదాలు పొందేందుకు శని మంత్రాన్ని జపించండి.
పసుపు
చేతిలోంచి పసుపు కింద పడడం కూడా ఎంతో అశుభం. వంట గదిలో పసుపు కింద పడితే దానికి అర్థం అవమానాలు లేదా సమాజంలో గౌరవం కోల్పోవడం వంటివి జరుగుతాయని సూచన. పసుపు వాస్తు శాస్త్రం ప్రకారం బృహస్పతి అలాగే శుభానికి చిహ్నంగా భావిస్తారు. కింద పడిపోయిన పసుపును తీసి పూజకు వాడండి. అలాగే గురు గ్రహం ఆశీస్సులను పొందేందుకు ప్రయత్నించండి. కింద పడిన పసుపులో కొంత భాగాన్ని దానం చేయండి.
వంట గదిలో ఏవైనా వస్తువులు కింద పడిపోతే దాన్ని తీసి వెంటనే గదిని శుభ్రం చేయండి. దీనివల్ల ప్రతికూల శక్తి తొలుగుతుంది. అలాగే ప్రతికూల శక్తిని తొలగించడానికి ఉప్పు, నిమ్మకాయ కలిపిన నీటితో వంటగదిని శుభ్రం చేయండి. అలాగే ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించండి. ఎల్లప్పుడూ వంటగదిని పరిశుభ్రంగా ఉంచండి. సాయంత్రం పూట దీపం వెలిగించండి. ఇవన్నీ కూడా ఇంట్లో సానుకూలతను పెంచుతాయి.