Rahul Ravindran : నటుడుగా కెరియర్ మొదలుపెట్టిన రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి సినిమాతోనే మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ తర్వాత కాలంలో కొన్ని సినిమాలు కూడా చేశారు. అయితే సుశాంత్ నటించిన చిల సౌ సినిమాతో దర్శకుడుగా మారాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. సక్సెస్ సాధించటం మాత్రమే కాకుండా అవార్డ్స్ కూడా రాబట్టింది.
రాహుల్ ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు తిరు వీర్ నటిస్తున్న ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ షోకు ఇప్పుడు విపరీతమైన రెస్పాన్స్ లభిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా మీద మంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ టాక్ రావడంతో రాహుల్ రవీంద్రను కూడా రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినడం చాలా సంతోషంగా ఉంది. అంటూ హీరో తిరువేరు మరియు చిత్ర యూనిట్ అంతటినీ కూడా కంగ్రాట్యులేట్ చేశారు.
అలానే నవంబర్ 7న విడుదలవుతున్న ప్రీ వెడ్డింగ్ షో, ది గర్ల్ ఫ్రెండ్, జటాధర సినిమాలు అన్నీ కూడా మంచి సక్సెస్ సాధించాలి. అలానే ఈ సినిమాలని ఎంకరేజ్ చేయమని ప్రేక్షకులను రాహుల్ రవీంద్రన్ కోరారు. అయితే తమ సినిమాకు పోటీగా వస్తున్న మిగతా సినిమాలకు కూడా అభినందనలు తెలియజేయడంతో రాహుల్ రవీంద్రన్ మీద మంచి ప్రశంసలు కురుస్తున్నాయి.
Hearing lovely things about #PreWeddingShow ♥️♥️ Thiruveer garu keeps delivering interesting gems consistently. Wishing the whole team superhit luck! May people watch and enjoy all 3 films coming out tomorrow 🙏🏾♥️ #Jatadhara #PreWeddingShow #TheGirlfriend https://t.co/d6FzLbo9fG
— Rahul Ravindran (@23_rahulr) November 5, 2025
రాహుల్ రవీంద్రన్ చేసిన చిలసౌ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన మన్మధుడు 2 సినిమా ఊహించిన రేంజ్ లో ఆడలేదు. గతంలో మన్మధుడు సినిమా మంచి సక్సెస్ అయింది. అదే సినిమా టైటిల్ ను ఈ సినిమాకి పెట్టేసరికి చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా అందుకోలేకపోయింది.
ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు డైరెక్టర్ గా సినిమా చేయలేదు రాహుల్. ఇక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సంబంధించి కూడా ప్రీమియర్ షో వేశారు. ఆ సినిమా చూసిన సెలబ్రిటీష్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా పైన మంచి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ప్రేక్షకులు ఈ సినిమాని ఏ రేంజ్ లో ఆదరిస్తారో వేచి చూడాలి.
Also Read: Funky : ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్, వంశీ కి 2025 కలిసి రావడం లేదని అర్థం అయిపోయినట్లే