HMPV VIRUS: హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (HMPV) అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని మంత్రి దామోదర రాజర్సింహ అన్నారు. ఈ వైరస్‌పై సోషల్ మీడియాలో భయభ్రాంతులకు గురి చేసేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
HMPV వైరస్ సోకినా శ్వాసకోస వ్యవస్థపై తక్కువ ప్రభావమే చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వాళ్లు దగ్గినా, తుమ్మినా తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఎక్కువగా హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇతర దేశాల్లోని పరిస్థితిని సమీక్షిస్తున్నామని.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ చేసుకుంటున్నామని చెప్పారు.
ఈ వైరస్‌పై ప్రజలు ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్నిరకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. డిసీజ్ సర్వేలైన్స్ సిస్టమ్ ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించామని, అన్నిరకాల సదుపాయాలతో అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
Also Read: HDFC Bank Jobs: HDFC బ్యాంక్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.12,00,000.. పూర్తి వివరాలివే..
హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రజలు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రభావం ఉందని తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అన్నారు. ఎలాంటి గడ్డు పరిస్థితిని అయినా ప్రభుత్వం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రచారం చేస్తే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని అన్నారు.