బీహార్ లో ఎన్నిలక వేడి కొనసాగుతోంది. రాజకీయ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. పార్టీల నాయకులు విమర్శలు, ప్రతి విమర్శల జోరు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు రాజకీయ ర్యాలీలతో హోరెత్తుతున్నాయి. ఇక బీహార్ ఎన్నికల్లో ప్రచారం కోసం నాయకులు హెలికాప్టర్లు, ఛార్డర్ విమానాలు వాడుతున్నారు. పెద్దల సంఖ్యలో వీటిని ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో ప్రతి నాయకుడు ఎన్నికల ప్రచారం కోసం వీటిని వినియోగిస్తున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల కోసం పాట్నా ఎయిర్ పోర్టులో పార్క్ చేసిన హెలికాప్టర్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాట్నాలోని జయ ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఎయిర్ స్ట్రిప్ అంతటా నిలిపి ఉంచిన హెలికాప్టర్లు కనిపిస్తున్నాయి. “ఇవి పాట్నా విమానాశ్రయంలో బీహార్ ఎన్నికల కోసం వరుసలో ఉన్న హెలికాప్టర్లు. భారతదేశం పేద దేశం అని ఎవరైనా చెబితే, అతడికి ఈ విజువల్స్ చూపించాలి” అంటూ మాజీ లెఫ్టినెంట్ కల్నల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
“బీహార్ ఎన్నికల్లో డబ్బులు ఏ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారో ఈ హెలికాప్టర్లను చూస్తే సరిపోతుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “బీహార్ లో రోడ్లు సరిగా లేకపోయినా ఫర్వాలేదు. అమెరికన్ క్వాలిటీ హెలికాప్టర్లతో ప్రచారం చేయడం చాలా ఆనందంగా ఉంది” అంటూ మరో వ్యక్తి వ్యంగంగా కామెంట్ చేశాడు. “భారత్ లో రాజకీయ నాయకులు, పాలకులు ఎప్పుడూ పేదలుగా లేరు. సాధారణ పౌరులు ఎప్పుడూ ధనవంతులు కాలేరు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
మరోవైపు ఈ వీడియో నిజమైనదేనా? అని కొంత మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజమో? కాదో తెలుసుకునేందుకు గ్రోక్ ను అడుగుతున్నారు. గ్రోక్ కూడా ఈ విజువల్స్ బీహార్ ఎన్నికల కోసం పాట్నా ఎయిర్ పోర్టులో ఉన్న హెలికాప్టర్లేనని నిర్థారించింది. ఈ ఎన్నికల ప్రచారం కోసం 23 హెలికాప్టర్లు, 12 చార్టర్డ్ విమానాలకు నిరంతరం నడుపుకునేందుకు ఈసీ అనుమతించింది. ప్రచారం తర్వాత వీటిని పార్క్ చేసేందుకు గయా, దర్భంగా, వారణాసి, లక్నో, రాంచీకి పంపుతున్నారు. ఈ ఎయిర్ సర్వీసులను పలు ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్నాయి. వీటిలో క్లబ్ వన్ ఎయిర్, పవన్ హన్స్, మహారాజా ఏవియేషన్, రెడ్ బర్డ్ ఏవియేషన్, ఎసిఎస్ చార్టర్ సర్వీసెస్, ట్రాన్స్ భారత్ ఏవియేషన్, గ్లోబల్ వెక్ట్రా, ఏరో ఎయిర్ చార్టర్డ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక ప్రచారానికి వెళ్లే ఒక్కో హెలికాప్టర్ కు సామర్థ్యాన్ని బట్టి గంటకు రూ. 6 నుంచి 1.5 లక్షలు ఛార్జ్ చేస్తారు.
These are the helicopters lined up for Bihar elections at Patna airport. If anybody says india is a poor country,well he needs a reboot. pic.twitter.com/TnmKbSLJ7C
— Lt Col Sushil Singh Sheoran, Veteran (@SushilS27538625) November 5, 2025
243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో ఇవాళ తొలి విడుదల పోలింగ్ జరుగుతోంది. ఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), బిజెపి నేతృత్వంలోని అధికార ఎన్డీఏ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొన్నది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సూరాజ్ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది.
Read Also: పేషెంట్ ను నడిరోడ్డు మీద స్ట్రెచర్ మీద తోసుకెళ్లిన బంధువులు, మరీ ఇంత ఘోరమా?