Big twist: ఘట్కేసర్ నుంచి గణపురం మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న కారు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. అయితే కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మంటలో నుంచి తప్పించుకోబోయే తగలబడతూ పక్కనే ఉన్న ఫుట్ పాత్ పై పడి మృతిచెందాడు.
అయితే, ఈ ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ప్రమాదం కాదని.. ఆత్మహత్య అని పోలీసులు వెల్లడించారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ప్రేమ జంట కారులో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతులను యాదాద్రి జిల్లా జమిలాపేటకు చెందిన శ్రీరామ్, మేడ్చల్ జిల్లా నారపల్లికి చెందిన లిఖితలుగా గుర్తించారు. ఈ ఘటనకు ముందు వారు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఘటనకు సంబంధించి మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యక్తులు శ్రీరామ్‌ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెడుతున్నట్లు తెలుస్తోంది. వారి వేధింపులు తట్టుకోలేకే ప్రేయసితో కలిసి శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో అతన్ని బ్లాక్మెయిల్ చేసిన వారి వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకి ముందు తాను చనిపోతున్నట్లు శ్రీరామ్ తన సోదరునికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని సమాచారం. ఆత్మహత్యకు ముందు వారిద్దరూ మేడిపల్లిలోని ఓ ట్రావెల్ కంపెనీ నుంచి కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: HDFC Bank Jobs: HDFC బ్యాంక్‌లో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.12,00,000.. పూర్తి వివరాలివే..
కారు ఘటనకు సంబంధించి ప్రమాద దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకూ వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించలేదు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీరామ్‌ను బ్లాక్మెయిల్ చేసిందెవరు?, ఏ విషయంలో అతన్ని వేధించారు?, వారిద్దరి మృతికి మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే నిజానిజాలు తెలియాాల్సి ఉంది.