CM Revanth Reddy: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక సమీపిస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాబోయే నాలుగు రోజుల ప్రచార కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని, ఓటర్లను ఆకర్షించడానికి చేపట్టాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు.
సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు, పలు ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో, రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
సమావేశంలో రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించండి అని సూచించారు. ప్రత్యేకంగా డివిజన్ స్థాయిలో బూత్ కమిటీలను చురుకుగా ఉంచాలని ఆయన ఆదేశించారు.
రేవంత్ రెడ్డి మరొక రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉంది. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి డివిజన్ స్థాయిలో ఉన్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించాలన్నారు.
సమావేశంలో చివరిగా రేవంత్ రెడ్డి నాలుగు రోజుల ప్రణాళికను ఖరారు చేశారు. ప్రతి డివిజన్‌లో మంత్రులు మరియు ఎమ్మెల్యేలు పర్యటించాలి. యువ ఓటర్లను ఆకర్షించే విధంగా సోషల్ మీడియా ప్రచారం బలోపేతం చేయాలి. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తల సమన్వయం పెంచాలి. చివరి రోజు రేవంత్ రెడ్డి రోడ్షోతో ప్రచారం ముగించాలి.
Also Read: మాగంటి కుటుంబంలో చిచ్చు.. BRS అభ్యర్థి సునీతకు ఊహించని షాక్
మరోవైపు, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఈ ఉపఎన్నికలో తమ బలం చూపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఇంటింటి అభివృద్ధి ప్రజలతో ప్రభుత్వం కార్యక్రమం ఓటర్లలో.. సానుకూలతను తెచ్చిందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.