Pawan Kalyan - Akira Nandan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్వామిమాలలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన కొడుకు అకీరా నందన్ తో కలిసి పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు.
Pawan Kalyan - Akira Nandan
ఈ క్రమంలోనే తమిళనాడు లోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, అకీరా నందన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Pawan Kalyan - Akira Nandan
ఇండియాలోని అతిపెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. దాదాపు 30 ఎకరాలలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.
Pawan Kalyan - Akira Nandan
తండ్రి వెంటే నడుస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న తండ్రి కొడుకుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరితో కలిసి ఫోటోలు దిగడానికి అభిమానులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.
Pawan Kalyan - Akira Nandan
ఇక పవన్ కళ్యాణ్ ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టి, తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరొకవైపు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.
Pawan Kalyan - Akira Nandan
అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG వంటి సినిమాలు లైన్లో ఉన్న విషయం తెలిసిందే .
ముందుగా హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.