BigTV English

Pulwama attack anniversary : పుల్వామా దాడికి ఐదేళ్లు – ఉగ్రవాదులపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంది

Pulwama attack anniversary : పుల్వామా దాడికి ఐదేళ్లు – ఉగ్రవాదులపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంది

Pulwama attack anniversary : సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో వరుసగా వెళుతున్న సైనికుల వాహనాల శ్రేణిపై ఘోరమైన దాడి జరిగింది. దేశ సేవలో ప్రతీ రక్తం బొట్టు “భారత్ మాతకు జై” అనే సైనికుల రక్తం గాల్లోకి ఎగిసిపడింది. దేశానికి తామే మొదటి రక్షకులమనే గర్వం, ఎలాంటి ఆపదలను అయినా ఎదుర్కోనే ధైర్యం.. గుండెల నిండా నింపుకుని దేశ సేవకు వెళుతున్న సైనికులపై.. అణువణువు విద్వేషం నింపుకున్న అతివాదులు దాడికి తెగబడ్డారు.కశ్మీర్ ను దేశం నుంచి విడదీసి పాకిస్తాన్ సరసర చేర్చాలనే ఉగ్రమూకల కుటిల ఆలోచనతో నిండిపోయిన.. ఓ ఉగ్రవాది ఆత్మహుతి దాడితి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 మంది భారత జవాన్లు వీర మరణం పొందారు. దేశం మొత్తం కన్నీరు పెట్టుకున్న ఈ ఘటన తాలుకు గుర్తుల్ని దేశం ఏటా గుర్తు చేసుకుంటూనే ఉంది. వారి దురాగతాలకు ఎప్పటికప్పుడు ముకుతాడు విధిస్తున్న దేశ సైనికులకు అభినందనలు తెలుపుతూనే ఉంది. ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఈ ఫిబ్రవరి 14న నాడు కేంద్ర ప్రభుత్వంలోని కీలక నాయకులు నివాళులు అర్పించారు.


ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సైనికుల్ని, వారి త్యాగాల్ని తలుచుకుంటూ ప్రధాని మోదీ ప్రత్యేక పోస్టు చేసారు. దేశం పట్ల వారి నిబద్ధతను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. 2019లో పుల్వామాలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు తన నివాళులు తెలియజేశారు. రాబోయే తరాలు వారి ధైర్యాన్ని, త్యాగాల్ని మర్చిపోదన్న ప్రధాని మోదీ.. దేశపట్ల వారి అనిర్వచనీయ భక్తిని నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై స్పందించిన హోం మంత్రి అమిత్ షా.. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. దేశం నుంచి ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదుల్ని పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ప్రకటించారు.  “2019లో ఈ రోజున పుల్వామాలో జరిగిన పిరికి ఉగ్రవాద దాడిలో అమరులైన సైనికులకు దేశం తరపున.. నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఉగ్రవాదం మానవ జాతికి అతిపెద్ద శత్రువు, ప్రపంచం మొత్తం దీనికి వ్యతిరేకంగా ఏకమైంది. అది సర్జికల్ స్ట్రైక్ అయినా, వైమానిక దాడి అయినా, మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులపై ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకెళ్లడం ద్వారా వారిని పూర్తిగా నాశనం చేయాలని నిశ్చయించుకుంది” అంటూ అమిత్ షా పోస్ట్ చేశారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం పుల్వామా వీరులకు నివాళులు అర్పించారు, అమరవీరులైన సైనికులను గౌరవించాలని సూచించారు. 2019లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో.. భారత్ ధైర్యవంతులైన సీఆర్ఫీఎఫ్ సిబ్బందిని కోల్పోయిందని, వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిదంటూ వ్యాఖ్యానించారు. వారికి తన నివాళులు అర్పించిన రాజ్ నాథ్ సింగ్.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎప్పుడు దృఢంగానే ఉంటుందన్నారు.

పాక్ ఉగ్ర సంస్థ బాధ్యత

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు తామే బాధ్యులమని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ (Jaish-e-Mohammed) ప్రకటించుకుంది. జవాన్లపై దాడికి పాల్పడింది.. ఆదిల్ అహ్మద్ దార్ అనే స్థానిక ఉగ్రవాదిగా తెలిపింది. అతను.. కశ్మీర్ ను భారత్ నుంచి విడదీయాలనే ఉగ్రవాదుల కుట్రలో భాగమై.. 300 కిలోల పేలుడు పదార్థాలను ఓ కారులో వాహనంలో ఉంచుకుని సీఆర్పీఎఫ్ బస్సును ఢీకొట్టాడు. దీంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

ప్రతీకారం తీర్చుకున్న భారత్ 

ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత ప్రభుత్వం.. ప్రతిస్పందనగా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల్ని దేశంలోకి ప్రవేశపెడుతున్న స్థావరాలపై విరుచుకుపడింది. దాడులకు ప్రతికారం తీర్చుకునేందుకు 26 ఫిబ్రవరి 2019న బాలాకోట్ లో ఎయిర్ స్ట్రైక్ చేసింది. పాకిస్థాన్ తో ఉన్న నియంత్రణ రేఖను దాటి పాక్ అక్రమిత కశ్మీర్ లోని ఖైబర్ పక్వా ప్రాంతంలోని ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడింది. దీనినే బాలాకోట్ దాడులుగా చెబుతుంటారు. ఇందులో.. భారత్ లోకి చోరబాట్లకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్న 300 మందికి పైగా శిక్షణ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భారత నిఘా వర్గాలు తెలిపారు. ఆ తర్వాత ఇరువైపుల తీవ్ర యుద్ధ వాతావరణ చెలరేగగా.. ఓ యుద్ధ విమానాన్ని నేలకూల్చిన పాకిస్థాన్.. అందులోని పైలట్ అభినందన్ వర్థమాన్ ను బందీగా పట్టుకుంది. భారత ప్రభుత్వ హెచ్చరికలతో అతన్ని వాఘా సరిహద్దుల నుంచి మార్చి 1 న తిరిగి భారత్ కు అప్పగించింది.

Also Read :  సీబీఎస్ఈ పరీక్షలో మార్పులు చేసిన బోర్డు.. ఇకపై అలాంటి స్టూడెంట్స్ కి చుక్కలే!

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×