Pragya Jaiswal (Source: Instagram)
ప్రగ్య జైస్వాల్.. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచె సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.
Pragya Jaiswal (Source: Instagram)
ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించినది.
Pragya Jaiswal (Source: Instagram)
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అటు ప్రగ్యా జైస్వాల్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు తలుపు తడుతాయి అనుకున్నారు. కానీ సినిమా ఆఫర్లు మాత్రం రాలేదు.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం బాలయ్య అఖండ 2 సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ . ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నూతన నటి విభాగంలో అవార్డు అందుకుంది ప్రగ్యా.
Pragya Jaiswal (Source: Instagram)
ఇప్పుడు మరో అవార్డును సొంతం చేసుకుంది. మిడ్ డే షో బిజ్ ఐకాన్స్ అవార్డ్స్ 2025లో భాగంగా మిస్ ఫ్రెష్ ఫేస్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది.
Pragya Jaiswal (Source: Instagram)
ప్రస్తుతం ఈ అవార్డును చూపిస్తూ ఫోటోలు పంచుకున్న ఈమె ధన్యవాదాలు కూడా తెలియజేసిందిm ఈ విషయం తెలిసి ప్రగ్యా జైస్వాల్ కి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.