Tamilnadu Crime: పవర్‌ఫుల్ వెపన్‌గా మారింది సోషల్‌మీడియా. దీనివల్ల మంచేకాదు.. చెడు కూడా ఆ రేంజ్‌లో ఉంది. ఏ స్థాయికి చేరిందంటే చివరకు పచ్చని సంసారాలు కుప్పకూలుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని, తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేశాడు కన్నతండ్రి.
కాపురంలో చిచ్చుపెట్టింది
తమిళనాడులోని తంజావూర్ జిల్లా గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల వినోద్‌కుమార్ ఉన్నాడు. అతడు ఓ వైపు ఫొటోగ్రాఫర్‌గా మరోవైపు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వినోద్‌కు పుష్కరకాలం కిందట నిత్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 12 ఏళ్ల ఓవియా, 8 ఏళ్ల కీర్తి, ఐదేళ్ల ఈశ్వరన్ పిల్లలున్నారు.
పిల్లలు పెరగడంతో వినోద్ కుమార్ సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాడు. చివరకు నష్టాలు రావడంతో ఓ హోటల్‌లో పనికి చేరాడు. చివరకు కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి.ఇంతవరకు వినోద్ ఫ్యామిలీ అసలు స్టోరీ. భార్య నిత్య సోషల్‌మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. అందులో వెళ్లడమేగానీ, తిరిగి రావడానికి ఇష్టపడరు.
ప్రియుడితో భార్య.. తట్టుకోలేకపోయిన భర్త
ఇదే సమయంలో నిత్యకు తిరువారూర్ జిల్లాకి చెందిన ఓ వ్యక్తితో సోషల్‌మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈలోగా ఫ్యామిలీలో కష్టాలు పెరగడంతో కష్టమని భావించింది. తన జీవితానికి సుఖం ఉండదని డిసైడ్ అయ్యింది. ఆరు నెలల కిందట భర్త, ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది.
ALSO READ: బయట నుంచి బ్యూటీ పార్లర్.. లోపల చూస్తే ఖంగు తినాల్సిందే
ఈ విషయం తెలిసి భర్త వినోద్‌కుమార్ షాకయ్యాడు. కొద్దిరోజుల కిందట ఇంటికి తిరిగి రావాలని భార్యని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. తల్లి లేని పిల్లలు, నలుగురు నాలుగు రకాల మాటలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం పిల్లలకు స్వీట్లు ఇచ్చి వాటిని వారు తింటుండగానే ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపేశాడు. ఆ ముగ్గురు స్పాట్‌లో చనిపోయారు.
అనంతరం వినోద్‌కుమార్ మదుక్కూర్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి జరిగినదంతా చెప్పి లొంగిపోయాడు. భార్య.. సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిన వ్యక్తితో వెళ్లిపోయిందని, దాన్ని తట్టుకోలేక మద్యానికి బానిస అయినట్టు చెప్పాడు. ఈ విషయంలో భార్యని పదేపదే మందలించాలని ఆమె ఏ మాత్రం వినలేదని పోలీసులకు వివరించాడు. మద్యం మత్తులో శుక్రవారం రాత్రి పిల్లలకు ఇద్దరికి స్వీట్లు పెట్టాడు.
ఇద్దర్ని బయటకు పంపాడు. మరో కూతురు కీర్తిని తన ఒడిలో పెట్టుకుని లాలిస్తూ గొంతు కోసేశాడు తండ్రి. కీర్తి కేకలకు ఓవియ-ఈశ్వర్ ఇంట్లోకి పరుగులు తీశారు. క్షణాల్లో ఇద్దరినీ గొంతుకోసి చంపేశాడు. రక్తపు మడుగులో పిల్లలను చూసి కన్నీరుమున్నీరు అయ్యాడు. తన భార్యకు గుణపాఠం చెప్పేశానని తాను పనిచేస్తున్న హోటల్‌కు వెళ్లి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి నేరుగా మదుక్కూర్ పోలీసు స్టేషన్‌కి వెళ్లాడు.