Mahika Sharma: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన కొత్త ప్రియురాలును ఇటీవల పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తన పుట్టిన సందర్భంగా మహికా శర్మతో డేటింగ్ లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించాడు హార్దిక్ పాండ్యా. నటాషాకు విడాకులు ఇచ్చిన అనంతరం మహికా శర్మతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యాడు. దీంతో మహిషా శర్మ గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈమె పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీదితో రిలేషన్ పెట్టుకున్నట్లు కూడా కొంతమంది వార్తలు వైరల్ చేస్తున్నారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( Shahid Afridi ) గురించి తెలియని వారు ఉండరు. అప్పట్లో విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయే షాహిద్ ఆఫ్రీది పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అయితే అలాంటి పాకిస్తాన్ కు చెందిన షాహిద్ ఆఫ్రీదికి హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు మహికా శర్మకు ( Mahika Sharma ) మధ్య రిలేషన్ ఉందట. అది కూడా 13 సంవత్సరాల వయసులోనే అతని ప్రేమలో మహికా శర్మ పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా మహికా శర్మ ఈ విషయాన్ని వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నటిగా రాణిస్తున్న మహికా శర్మ, తన ఫస్ట్ క్రష్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది అని అప్పట్లో వెల్లడించినట్లు తెలుస్తోంది. 13 సంవత్సరాల నుంచి షాహిద్ అఫ్రీదిని ఇష్టపడుతున్నట్లు వెల్లడించిందట. 2022లో జరిగిన ఇంటర్వ్యూ సందర్భంగా మహికా శర్మ ఈ విషయాన్ని బయట పెట్టింది. దీంతో ఈ అంశం వివాదంగా మారింది. అయితే పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీదితో సంబంధం పెట్టుకున్న మహికా శర్మను హార్దిక్ పాండ్యా ఎలా ప్రేమించాడని ఇప్పుడు ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు ఏడాది కాలం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డాడు. ప్రముఖ మోడల్, నటి మహికా శర్మను ప్రేమిస్తున్నాడు హార్థిక్ పాండ్యా. ఈ మేరకు తన పుట్టినరోజు సందర్భంగా ప్రియురాలిని పరిచయం చేశాడు. ఆమెతో దిగిన హాట్ ఫోటోలను పంచుకున్నాడు. తనకు కాబోయే భార్య మహికా శర్మ అంటూ ప్రకటించేశాడు. దీంతో వీళ్లిద్దరు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన ఆయన అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇది ఇలా ఉండగా, నటాషాకు ఇప్పటికే విడాకులు ఇచ్చాడు టీమిండియా ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా. ఈ జంటకు ఇప్పటికే అగస్త్య అనే కుర్రాడు కూడా ఉన్నాడు. నటాషా దగ్గర కొన్ని రోజులు, టీమిండియా ఆల్ రౌండర్ హర్ధిక్ పాండ్యా దగ్గర కొన్న రోజులు ఉంటున్నాడు అగస్త్య.
🚨 Hardik Pandya has found new love. Cricketer Hardik Pandya has finally confirmed his new relationship with 24-year-old model Mahika Sharma, who was spotted at the Mumbai airport.#HardikPandya #MahikaSharma#HardikPandaya pic.twitter.com/WZqnhvXbBV
— Real sigma (@Realsigma0011) October 10, 2025