Nindu Noorella Saavasam Serial Today Episode: చంభా, మంగళను కలిసి డబ్బులు ఆశ చూపించి అమర్ ఇంట్లో ఉన్న ఆరు ఫోటో ముందు ఆస్తికలు గురించి చెప్పి వాటిని తీసుకురావాలని చెప్తుంది. డబ్బుకు ఆశపడిన మంగళ చంభా చెప్పిన పనికి ఒప్పుకుంటుంది. ఎవ్వరూ లేని టైం చూసి ఇంట్లోకి వెళ్లి ఆస్థికలు తీసుకొస్తానని చెప్తుంది. చెప్పినట్టుగానే మంగళ అమర్ ఇంట్లోకి నకిలీ ఆస్తికలు ఉన్న కుండ తీసుకుని వెళ్తుంది. ఇంట్లోకి మంగళ సంచీతో వెళ్లడం చూస్తుంది ఆరు ఆత్మ. ఈవిడ ఇప్పుడెందుకు వచ్చింది. అయినా బ్యాగ్ తీసుకుని వచ్చింది ఎందుకై ఉంటుంది గుప్తగారు అని అడుగుతుంది. ఏమో బాలిక చూస్తేనే తెలుస్తుంది కదా..? అంటాడు గుప్త అయితే పదండి చూద్దాం అంటూ కిటికీ దగ్గరకు వెళ్తారు ఇద్దరూ..
ఇంట్లోకి వెళ్లిన మంగళ ఏకంగా ఆరు రూం తెరుచుకుని లోపలికి వెళ్తుంటే.. ఆరు చూసి అదేంటి గుప్త గారు ఆమె నా రూంలోకి వెళ్తున్నారు.. ఎందుకు ఏం చేయబోతున్నారు..? అని అడగ్గానే.. ఏం చేస్తుందో ఇప్పుడు చూస్తేనే ఉన్నాం కదా బాలిక.. ఎందుకు కంగారు పడతావు.. చూడుము అంటాడు గుప్త. రూంలోకి వెళ్లిన మంగళ భయంభయంగానే ఆరు ఫోటో చూస్తూ.. ఫోటో ఎదురుగా ఉన్న ఆస్థికల కుండను మార్చేస్తుంది. అది చూసిన ఆరు షాక్ అవుతుంది. అదేంటి గుప్త గారు ఆవిడ నా ఆస్థికలు మారుస్తున్నారేంటి..? ఆస్థికలతో ఏం చేయబోతుంది. అసలు ఏమీ అర్థం కావడం లేదు గుప్త గారు అంటుంది ఆరు. దీంతో గుప్త మౌనంగా ఉండిపోతాడు. గుప్త గారు చెప్పండి గుప్తగారు.. ఏం చేయబోతున్నారు ఆవిడ.. అంటూ గట్టిగా అడగ్గానే.. ఆ బాలిక నీ ఆస్థికలు తీసుకెల్లి ఆ దుష్ట మాత్రికురాలకు ఇవ్వబోతుంది బాలిక. ఈ పాటికే దుష్ట ఘోర, ఆ మాంత్రికురాలు కలిసి పోయారు.. ఎలాగైనా నిన్ను బంధించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు అంటూ గుప్త చెప్పగానే. ఆరు భయపడుతుంది. ఇంతలో మంగల ఆస్తికలు తీసుకుని బయటకు వస్తుంది.
గార్డెన్‌లోకి వచ్చిన ఆరు బాధపడుతుంటే.. గుప్త వచ్చి ముందు వెనక ఆలోచించకుండా నువ్వు చేసిన అనాలోచిన పని ఎంతటి అనర్థమును తెచ్చిపెట్టిందో చూసినవా బాలిక అంటాడు. దీంతో ఆరు కూడా బాధగా అవును గుప్త గారు నేను తొందరపడి ఆయనలో ప్రవేశించకుండా ఉండి ఉంటే..ఈ పాటికే మనోహరి గురించి ఆయనకు మొత్తం తెలిసిపోయేది. తప్పు చేశాను గుప్త గారు.. అంటుంది. దీంతో గుప్త ఇంకనూ ఆలస్యం చేసినచో మరిన్ని అనర్థాలు జరుగును బాలిక. అది నీకునూ నీ కుటుంబమునకు మంచిది కాదు అని గుప్త హెచ్చరింగానే.. ఏమంటున్నారు గుప్త గారు నాకేం అర్థం కావడం లేదు అంటుంది ఆరు.
గుప్త సీరియస్‌గా నువ్వు తక్షణమే మా లోకమునకు రావలెను.. లేదంటే ఆ చంభా, ఘోరా కలిసి నిన్ను బంధించి క్షుద్ర పూజలు చేయాలని చూస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నానో అవగతం చేసుకో బాలిక. లేదంటే నువ్వు దుష్ట శక్తుల పన్నాగమును బలి అయినచో మరు జన్మ పొందక.. పిశాచివై ఈ లోకంలో సంచరిస్తావు అని చెప్పగానే.. ఆరు భయపెడతారేంటి గుప్త గారు. మీరు చెప్తుంటేనే నాకు వణుకు పుడుతుంది అంటుంది. దీంతో గుప్త భయపెట్టడం కాదు బాలిక. వాస్తవం చెప్తున్నాను. నువ్వు త్వరపడవలెను.. నీ శ్రాద్ద కర్మలు జరిపించుకొనవలెను. అప్పుడే నీ మరుజన్మకు మార్గం సుగమం అవును. అప్పుడే నీ పతి దేవుడు నీ పిల్లపిచ్చుకలు సుఖముగా ఉండెదరు అని చెప్పగానే.. ఆరు ఆలోచిస్తూ కానీ నా చేతుల్లో ఏమి ఉంది గుప్త గారు. ఇవ్వనీ చేయాల్సింది వాళ్లు కదా..? అని అడుగుతుంది.
వారితో చేయించాల్సింది నువ్వే అందులకు నీ సహోదరి సహాయం తీసుకొనుము.. అని చెప్పగానే.. భాగీనా..? భాగీతో ఎలా చెప్పాలి.. ఈ విషయాలు.. అయినా భాగీ ఒప్పుకుంటుందా గుప్త గారు అని అడగ్గానే.. అవును ఏ సహోదరికి నువ్వు పుత్రికగా జన్మించెదవో.. ఆ సహోదరే నీ ఉత్తర క్రియలకు మార్గం వేయును అని చెప్తాడు. దీంతో ఆరు ఆలోచిస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.