Himachal Pradesh News: అక్రమ సంబంధాలతో పచ్చని సంసారాలు ముక్కలవుతున్నాయి. ఇటీవలకాలంలో ఇదీ మరింత ఎక్కువైంది. అఫ్ కోర్సు అందుకు కారణాలు చాలానే ఉంటాయి. భార్యభర్తలు ఇద్దరు కూర్చుని తమ సమస్యల గురించి చర్చించుకుంటే ఫుల్‌స్టాప్ పడేది. అలా చేయకుండా ఎడముఖం.. పెడముఖంగా వ్యవహరిస్తున్నారు. నాలుగు గోడలు మధ్య జరగాల్సిన విషయాన్ని నలుగురు మధ్యకు తెచ్చుకుని తల దించుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
భర్తకు దొరికిపోయిన భార్య
హిమాచల్‌ప్రదేశ్ సోలన్ ప్రాంతంలో భర్తను మోసం చేసింది భార్య. రూమ్‌లో ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయింది. దీంతో షాకయ్యాడు ఆమె భర్త. ఇంతకీ ఆమె ప్రియుడి ఎవరో తెలుసా? సొంత మేనల్లుడితో రూములో చిక్కింది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది.
ఎవరు? ఎక్కడివారు? అనే విషయాలను కాసేపు పక్కనబెడదాం. సుమిత్ కుమార్ తన భార్యతో కలిసి హిమాచల్‌ప్రదేశ్ వెళ్లాడు. సోలన్ ప్రాంతంలో అద్దెకు దిగారు. కొంతసేపు రీఫ్రెస్ అయిన బయట పని ఉందని భర్తకు చెప్పింది భార్య. సరే వెళ్లమని భర్త చెప్పాడు. రెడీ అయిపోయిన భార్య ఓ హోటల్ రూముకి వెళ్లింది. అప్పటికే భర్తకు అనుమానం వచ్చింది.
అసలు మేటరేంటి?
తయారై బయటకు వెళ్లడంతో ఆమె ఫాలో అయ్యాడు భర్త సుమిత్. అతడి భార్య మరో హోటల్ రూమ్‌లోని తన ప్రియుడి దగ్గరకు వెళ్లింది. వీరిద్దరూ రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా సుమిత్ ఎంటరయ్యాడు. వారిద్దరిని అలా చూసి షాకయ్యాడు. తమను కొట్టొద్దని, వీడియో తీసుకో అని సలహా ఇచ్చేసిందట భార్య. మరోవైపు భార్య ప్రియుడి సారీ చెప్పడంతో లాగి చెంప ఛెళ్లుమనిపించాడు.
ALSO READ: రాయిని బద్దలకొడితే డైనోసార్ కండోమ్ బయటకు
భార్య-ఆమె ప్రియుడి మధ్య ఈ తతంగం దాదాపు దశాబ్దం పాటు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై రకరకాల కామెంట్స్ పడిపోతున్నాయి. ఇన్నాళ్లుగా ఎలా భరించావంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. విడాకులు ఇచ్చేస్తే సరిపోతుందని మరికొందరు అంటున్నారు. ఆ మహిళను నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.
Husband caught wife in a hotel with lover😡
Here is full video👇👇 https://t.co/NgKTvgEgO5 pic.twitter.com/lyWpJpsfdf
— ShoneeKapoor (@ShoneeKapoor) October 11, 2025