BigTV English

Nizamabad Car Incident: నిజామాబాద్‌లో దారుణం.. కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు మృతి

Nizamabad Car Incident: నిజామాబాద్‌లో దారుణం.. కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు మృతి

Nizamabad Car Incident: మాటలకందని విషాదం! గుండెపగిలేంత దారుణం! చిన్నపాటి నిర్లక్ష్యం.. ఆ బాలుడి ప్రాణం తీసింది. నిజమాబాద్ జిల్లాలో జరిగిన ఈ యాక్సిడెంట్.. ప్రతి ఒక్కరినీ కలిచివేసింది.


తాజాగా నిజామాబాద్‌లో కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు ఖయ్యూం మృతి చెందాడు. రోడ్డుపక్కన ఆడుకుంటున్న బాలుడిపైకి నిర్లక్ష్యంగా కారు ఎక్కించాడు డ్రైవర్ సోఫియాన్. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హాస్పిటల్‌కు తరలించేలోగా మృతిచెందాడు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేశారు.

కేసును చేధించిన పోలీసులు కారును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డ్రైవర్‌ను సోఫియాన్‌గా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని తెలిపారు. మొదట కేసు పెట్టొద్దు అనుకున్న బాలుడి పేరెంట్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి.. వారి నుంచి ఫిర్యాదు తీసుకున్నామన్నారు. విచారణ కొనసాగుతోందని.. నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమన్నారు సీఐ.


కాగా ఇటీవల మేడ్చల్ జిల్లాలో టిప్పర్ కింద పడి చిన్నారి మృతి చెందిన సంగతి తెలిసిందే.. కేవలం.. అరసెకను ఆగి ఉంటే ఆ పిల్లాడి ప్రాణం నిలబడేది. ఊహించని ప్రమాదం జరిగిన ప్రతిసారీ.. అంతా ఇలాగే అనుకుంటారు. కానీ.. రెప్పపాటులో జరిగిన ఘోరానికి.. పిల్లాడు బలైపోయాడు. ఒక్క సెకను ఆలస్యమైనా.. ఎప్పటిలాగే అభిమన్షు స్కూల్‌కి వెళ్లిపోయేవాడు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేసేవాడు. కానీ.. ఈలోపే.. ఊహించని రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

స్కూల్‌కి ఆలస్యమవుతుందనే తొందర్లోనే.. పక్కన వెళ్లే వాహనాల స్పీడ్‌ని అంచనా వేయడంలో జరిగే పొరపాట్లతోనో.. లేక ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేయాలన్న ఆలోచనతోనో.. చాలా మంది రోడ్ సేఫ్టీని పట్టించుకోరు. కానీ.. ఓ చిన్న నిర్లక్ష్యం.. ఎంత విషాదాన్ని మిగిలిస్తుందో చెప్పడానికి.. ఇలాంటి ప్రమాదాలే ఓ ఉదాహరణ.

Also Read: శ్రీవారిని దర్శించుకుని.. టెంపోను ఢీ కొట్టిన లారీ స్పాట్‌లోనే 14 మంది..

ఇలాంటి ప్రమాదాలు గతంలోనే జరిగాయి. ఆరో తరగతి విద్యార్థిని.. తన తల్లితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగొస్తుండగా.. ఉప్పల్ నుంచి వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ విద్యార్థిని చనిపోయింది. అందువల్ల.. రోడ్డు మీదకు వెళితే.. ఇంటికి తిరిగి సేఫ్‌గా వస్తామన్న గ్యారంటీ లేదు. అందువల్ల.. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. రోడ్ సేఫ్టీ నిబంధనలు ఫాలో అవ్వాలి. ఓవర్ స్పీడ్‌తో వెళ్లకుండా.. సడన్‌గా టర్న్ అవకుండా.. అన్ని రకాల రూల్స్ పాటించాలి. అప్పుడే.. ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలం. లేకపోతే.. ఇలా ఊహించిన ప్రమాదాలతో.. ప్రాణాలే కోల్పోయే పరిస్థితి వస్తుంది.

Related News

Mancherial News: చెన్నూర్‌ ఎస్‌బీఐలో ‘లక్కీ‌ భాస్కర్’.. మూడు కోట్లు మాయం, రంగంలోకి పోలీసులు

Honey trap scam: 81 ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్ షాక్.. రూ.7.11 లక్షలు మాయం!

Annamaya District: అన్నమయ్య జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి, ఒకరు గల్లంతు

Bhadradri Crime: ప్రాణం తీసిన పెళ్లి చూపులు.. యువతిని ఓయోకు తీసుకెళ్లి దారుణం

Delhi Triple Murder: ఢిల్లీలో ఘోరం.. ఓ ఫ్యామిలీలో ముగ్గురు దారుణ హత్య, నిందితుడు కుటుంబసభ్యుడే?

Hydrabad News: మియాపూర్‌లో దారుణం.. ఐదుగురు వ్యక్తులు సూసైడ్, ఏం కష్టమొచ్చింది?

Big Stories

×