BigTV English

Siddu Jonnalagadda: లవ్ స్టోరీని బయటపెట్టిన సిద్దు..ఆ తప్పు వల్లే దూరం?

Siddu Jonnalagadda: లవ్ స్టోరీని బయటపెట్టిన సిద్దు..ఆ తప్పు వల్లే దూరం?

Siddu Jonnalagadda: యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.. ఈయన నటించిన టిల్లు సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆయన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఆయన నటించిన ఓ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు తెలుసు కదా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 17 న దీపావళి సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.. ఈ సందర్భంగా ఆయన పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో తన లవ్ స్టోరీ గురించి బయట పెట్టాడు. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది..


సిద్దు లవ్ ఫెయిల్యూర్..

సిద్దు జొన్నలగడ్డ, రాశిఖన్నా జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం తెలుసు కదా.. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మొదలుపెట్టారు. సిద్దు పలు చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టారు. సిద్దు మాట్లాడుతూ.. నేను ఏడో తరగతిలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. పదో తరగతి వరకు కలిసి చదువుకున్నాం. కానీ, ఆ అమ్మాయితో నా ప్రేమ గురించి చెప్పలేదు. ఇంతలోనే పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. చివరి రోజున శ్లామ్ బుక్ తీసుకొని తన వద్దకు వెళ్లాను. ఒక కొటేషన్‌తో పాటు తన ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా అందులో రాసింది.. ఆ తర్వాత నా తిట్టు ఒక చూపు చూసి అక్కడ నుంచి సైకిల్ పై వెళ్ళిపోయింది. తర్వాత ఎక్కడ కలవలేదు. ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పటికీ ఆమె ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉంటాను. నేను చేసుకోవాల్సిన ఆమె ఇప్పుడు పిల్లల తల్లి కూడా అని బాధపడుతూ ఉంటాను.. అంటూ సిద్దు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంటర్వ్యూ వీడియోని నెటిజెన్లు షేర్ చేస్తూ సిద్దు లవ్ ఫెయిల్యూర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు..

‘తెలుసు కదా’ మూవీ..

‘తెలుసు కదా’ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, టి.జి.కృతిప్రసాద్‌ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు.. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిన యువకుడి స్టోరీ తో ఈ సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ యూత్ని బాగా ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీ గా రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్లో టీం బిజీగా ఉన్నారు.. ఈ మూవీ పై సిద్దు ఆశలు పెట్టుకున్నారు. మరి మూవీ థియేటర్లలోకి రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మూవీ తర్వాత టిల్లు 3 సినిమాలో నటించే అవకాశం ఉందని సమాచారం.


Related News

Film industry: ప్రముఖ నటి, ఆస్కార్ గ్రహీత కన్నుమూత!

Srikanth Iyengar : గాంధీపై నటుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు.. ఆ సినిమా బ్యాన్..?

Actress Meena: గీతాంజలి సినిమా మీనా చేయాల్సిందా.. అలా మిస్ చేసుకుందా?

Nithiin: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ… అంతా తమ్ముడు ఎఫెక్ట్

Chiranjeevi: నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ను కలిసిన చిరంజీవి !

Sai Dharam Tej : అల్లు అర్జున్ గురించి సాయి తేజ్ లేటెస్ట్ కామెంట్స్, ఆయన ఇప్పుడు గొప్పోళ్ళు అయిపోయారు

Mowgli Release Date: మొగ్లీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ , క్రేజీ వీడియో

Big Stories

×