Intinti Ramayanam Today Episode October 12th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తూ ఉంటుంది. చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత టెన్షన్ పడుతూ ఈరోజు నా పని అయిపోయినట్లే అని అనుకుంటుంది.. ఎలాగైనా సరే ఇంట్లో వాళ్లకి తెలియకుండా ఆ డబ్బులు నీ అక్కడ పెట్టేయాలని అనుకుంటుంది పల్లవి. వాళ్ల నాన్న అడిగి డబ్బులు తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా డబ్బులను అక్షయ్ గదిలో పెట్టబోతుంది. పల్లవి గదిలో డబ్బులు పెట్టడం చూసినా కమల్ అవని వీడియో తీసి మరి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. ఇన్ని రోజులు ఆ డబ్బులు నువ్వే తీసావ్ అని అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు నువ్వు తీసావని కన్ఫామ్ అయిపోయింది. నీ సంగతి తేలుస్తాను రా అని కమల్ పల్లవిని తీసుకొని కిందకు వెళ్తాడు. ఇంట్లోనే వాళ్ళందరినీ కేకలు వేసి పిలుస్తాడు. అయితే ఏమైంది అని పార్వతి భానుమతి అడుగుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. డబ్బులు దొంగతనం చేసి మా వదిన మీద నిందలు వేస్తావని అందరూ పల్లవి పై సీరియస్ అవుతారు. అటు శ్రీకర్ కూడా మా వదిన దొంగతనం చేసిందని అంటావా అని పల్లవి పై అరుస్తాడు. శ్రీయ కూడా నీకు అవని అక్క మీద కోపం ఉంటే వేరేలా తెచ్చుకోవాలి అంతేగాని ఇలా తీర్చుకోవడం ఎందుకు అని పల్లవి పై సీరియస్ అవుతుంది. ప్రణతి కూడా మా వదినని ఇలా ఇరికించడం మంచిదా అనుకుంటున్నావా..? మా వదిన తప్పంటావా అని బుద్ధి పెడుతుంది. భరత్ కూడా తనకు సాయం చేస్తుంటే మంచి దానివి అని అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని సీరియస్ అవుతాడు.
భరత్ నాకున్న డిగ్రీకి కనీసం ఎవరు 10,000 కూడా అప్పు ఇవ్వరు. పల్లవి నాకు 50 లక్షలు వచ్చేలా చేసింది. ఇది నిజం బావగారు.. నాకు 50 లక్షలు ఇవ్వడం మాత్రమే కాదు ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. పల్లవి మంచితనాన్ని చూసి నేను నిజమే అనుకున్నాను. నాకు ఇంతగా సాయం చేస్తుంది అని ఎంతగానో సంతోష్ పడ్డాను. కానీ మా అక్కనే ఇలా ఇరికిస్తుందని అసలు ఊహించలేదు. నువ్వు ఇలాంటి దానివని అసలు నేను నమ్మలేకపోతున్నానని భరత్ అంటాడు.
ఇక పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ మాత్రం చెప్పిన మాట వినకుండా నువ్వు చేసింది తప్పే అని అంటాడు.. నిన్ను నా కూతురు కన్నా ఎక్కువగా నమ్మాను. కానీ నువ్వు చేసింది ఏంటి అని అంటుంది. నువ్విలాంటి పనులు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నా చేతే అవని ఇంట్లోంచి బయటికి గెంటిస్తావా? లేనిపోనివి చెప్పి నన్ను నీమీద తప్పుడు అభిప్రాయం వచ్చేలా చేసింది పల్లవిని అని అసలు నిజం అని బయటపెడుతుంది పార్వతి.. ఇక అక్షయ్ కూడా నీవల్ల నా భార్యను ఎంతో అపార్థం చేసుకున్నాను అని అంటాడు.
ఇక కమల్ ఇలాంటి మోసగత్తే.. ఇంట్లో ఇన్ని తప్పులు చేసిన తర్వాత కూడా ఎలా ఉంచాలి? నువ్వు నా ఇంట్లో అవసరం లేదు అని కమల్ పల్లవిని బయటికి లాక్కొని వస్తాడు. బావ నేను చెప్పేది విను బావ అని పల్లవి ఎంత చెప్తున్నా సరే కమల్ వినడు. లగేజ్ తో సహా బయటకి మెడ పట్టుకొని గెంటేస్తాడు. నీలాంటిది నా ఇంటికి ఈ ఇంటికి కోడలుగా పనికిరాదు అని అంటాడు. ఇంకెప్పుడూ ఈ ఇంట్లోకి అడుగు కూడా పెట్టొద్దు అని కమల్ అంటాడు. తర్వాత రాత్రి అక్షయ్ అవనికి సారీ చెప్తాడు. నువ్వు ఎంతగా అపార్థం చేసుకున్నాను.
Also Read: బాలు కోరిక తీరిందా..? ఈగలు తోలుకుంటున్న ప్రభావతి.. క్లాసికల్ డ్యాన్స్..
ఇదంతా నా తప్పే నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అని అంటాడు. అవని మీరు నా తప్పేమీ లేదని తెలుసుకుంటే చాలు అని అంటుంది. మీరిద్దరిలా కలిసి ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని రాజేంద్రప్రసాద్ పార్వతి అంటారు.. మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని వాళ్లు అంటారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..