INDW vs AUSW: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇప్పటికే 12 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ 13 మ్యాచ్ నిర్వహించనుంది ఐసీసీ. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారు అయింది.
Also Read: IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( India Women vs Australia Women ) మధ్య మహిళల జట్ల మధ్య ఫైట్ జరగనుంది. విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండున్నర గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇవాల్టి మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. మొన్న ఇదే విశాఖపట్నం వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఛేజింగ్ చేసి విజయాన్ని అందుకుంది. కాబట్టి ఇవాళ కూడా మొదట బౌలింగ్ చేసిన జట్టుకు పిచ్ అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.
ఆసీస్ మ్యాచ్ లో టీమిండియా ఓడితే ఎలాంటి ఢోకా ఉండదు. పాయింట్లు పట్టికలో ప్రస్తుతం నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఒకవేళ ఇవాళ ఆసీస్ పైన టీమిండియా గెలిస్తే రెండవ స్థానానికి వెళుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా మూడో స్థానంలో ఉంది. ఇవాళ టీం ఇండియా గెలిస్తే రెండవ స్థానం రావడం పక్కా. అదే ఆస్ట్రేలియా గెలిస్తే మొదటి స్థానానికి వెళుతుంది. అప్పుడు టీమిండియా మూడో స్థానంలోనే నిలుస్తుంది.
ఇండియా ప్రాబబుల్ ఎలెవన ( India Women ): స్మృతి మంధాన (Smirithi mandanna), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (C), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ ( wk ), అమంజోత్ కౌర్, స్నేహ రాణా, శ్రీ చరణి/రాధా యాదవ్, రేణుకా ఠాకూర్
ఆస్ట్రేలియా ప్రాబబుల్ XI ( Australia Women ): అలిస్సా హీలీ (C & wk), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినక్స్, కిమ్ గార్త్, అలనా కింగ్, మేగాన్ షుట్