Viral Video: హాలీవుడ్ సినిమాల ప్రభావం యువతపై బాగానే పడింది. ఈ నేపథ్యంలో రకరకాల విన్యాసాలు, ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా కొందరు యువకులు గుంపుగా ఏర్పడి పట్టపగలు రోడ్లపై హాలీవుడ్ స్టయిల్‌లో విన్యాసాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
ఏదైనా అతి చేయకూడదు.. తేడా వస్తే భూమి మీద నూకలు చెల్లినట్టే. పని పాటా లేని కొందరు యువకులు ఇదిగో రోడ్లపైకి కార్లతో వచ్చారు. అసలే యువ రక్తం, ఏమైనా చేయాలన్నది అనుక్షణం వెంటాడుతుంది. అదే జరిగింది. గ్రేటర్ నోయిడా శివారులోని జిఎల్ బజాజ్ కళాశాల వెలుపల కొందరు యువకులు కార్లపై ప్రమాదకరమైన విన్యాసాలు చేశారు.
ఒకటి రెండు కాదు ఏకంగా మూడు కార్లపై విన్యాసాలు చేస్తూ తమ బుర్రలోని ఆలోచనలను బయటపెట్టారు. తమదైన శైలిలో పట్టపగలు విన్యాసాలు చేశారు. ఓ కారుపై బీజేపీ జెండా ఉంది. ఆ కారు బీజేపీకి చెందిన వ్యక్తిది కావచ్చని అంటున్నారు. వైరల్ వీడియోలో మూడు కార్లు అతివేగంగా వెళుతున్నట్లు కనిపించాయి.
అకస్మాత్తుగా ఓవర్ టేకింగ్, కారు విండోలో నుండి బయటకు జంప్ చేయడం వంటివి కనిపించాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం చేసినట్టు చెబుతున్నారు. కళాశాల వెలుపల రద్దీగా ఉండే రోడ్లలో మూడు కార్లపై యువకుల నిర్లక్ష్యం డ్రైవింగ్ కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఓ వ్యక్తి చేతిలో కర్ర ఊపుతూ కారు కిటికీలోంచి బయటకు వస్తున్నట్లు ఉంది.
ALSO READ: జీపులో వచ్చారు.. లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు, ఆపై ఏం జరిగిందంటే
మూడవ కారు జిగ్ జాక్ స్టయిల్‌లో అతి వేగంగా దూసుకుపోతూ కనిపించింది. స్టంట్స్ వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పోలీసులు ఆయా వాహనాలపై దృష్టి పెట్టారు. నంబర్ ప్లేట్లు ఆధారంగా వాహనాలను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు.
అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పోలీసులకు ఆయా కార్లకు జరిమానా విధించారు. ఓ కారుకు 63 వేలు, మరొక కారుకు 57 వేలు పైనే జరిమానా విధించినట్టు తెలుస్తోంది. విన్యాసాలు ఏమోగానీ లక్షకు పైగానే యువకులకు జరిమానా పడిందన్నమాట.
Law and Order Under Yogi
Open Hooliganism of Car Riders in Greater Noida
— Near GL Bajaj College, Boys in 3 Vehicles Performed Stunts.
— They Openly waved Sticks.— Many Pedestrians and Vehicles had a Narrow Escape.
One Vehicle had a "BJP" Flag on it.#UttarPardesh… pic.twitter.com/kqn6n6oWc2
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) June 30, 2025