Orient Spectra: భారతీయ విద్యార్థులపై అమెరికా ఆంక్షల కొరడా ఝలిపిస్తోందా? ఇండియా నుంచి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థుల ఆలోచన ఏంటి? ఇప్పుడు ఎటు వైపు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు? యూరప్ వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నరా? బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో నిర్వహించిన గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో-2025లో విద్యార్థులు ఏమంటున్నారు అన్నదానిపై ఓ లుక్కేద్దాం.
గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో-2025
భారతీయ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో విదేశాల్లో చదువుకునే ఆలోచనలో పడ్డారు. విదేశాల్లో చదువుకుంటే లైఫ్ లో సెటిలైపోవచ్చని భావించారు. అమెరికా కొత్త నిబంధనలతో విద్యార్థుల ఆలోచన తీరు మారినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ విద్యార్థిన్ని పలకరించినా అమెరికా… అమెరికా అనే మాట వినబడేది.
ఇప్పుడు యూరప్‌తోపాటు పాటు వివిధ దేశాల వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. బంజారాహిల్స్‌లోని హయత్ ప్లేస్‌లో నిర్వహించిన గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో-2025లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో కు వివిధ దేశాల నుంచి దాదాపు 30పైగా యూనివర్సిటీల ప్రతినిధులు హాజరయ్యారు.
విదేశీ విద్యపై విద్యార్థుల చూపు
ట్యూషన్ ఫీజు, స్కాలర్ షిప్, అవకాశాలు వంటివి విద్యార్థులకు వివరించారు. దీనికితోడు ఏ తరహా కోర్సులకు రాబోయే రోజుల్లో డిమాండ్ ఉండనుంది అనేవాటిని యూనివర్సిటీ ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకున్నారు విద్యార్థులు. గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో-2025 మాంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు. నేరుగా యూనివర్సిటీ ప్రతినిధులతో విద్యార్థులు ఇంటరాక్ట్ అయిన తీరు బాగుందన్నారు.
ALSO READ: ఎల్బీనగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ని ఢీ కొట్టిన కారు నుజ్జునుజ్జు
స్కాలర్ షిప్ వస్తుందని తెలియడంతో చాలామంది విద్యార్థులు మొగ్గుచూపారు. ఐదు లక్షలు స్కాలర్ షిప్.. ట్యూషన్ ఫీజులో మైనస్ కావడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. వర్సిటీ ప్రతినిధులతో మాట్లాడినవారు.. కోర్సుపై క్లారిటీ రావడంతో వివిధ బ్యాంకులతో మాట్లాడారని చెప్పుకొచ్చారు నిర్వాహకులు. ఓ వైపు వర్సిటీ ప్రతినిధులు.. ఇంకోవైపు బ్యాంకులు ఉండడంతో పేరెంట్స్ హ్యాపీగా ఫీలయ్యారని అంటున్నారు. ఇంకా ఏమన్నారో తెలియాలంటే ఆ వీడియోపై ఓ లుక్కేద్దాం.