Priyamani: హీరోయిన్ ప్రియమణి గ్లామర్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు ఉవ్విల్లూరుతోంది.
మ్యారేజ్ అయినా నటనకు ఏమాత్రం అడ్డం కాదని నిరూపిస్తోంది.
గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచినా, తానింకా యంగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
మ్యారేజ్ తర్వాత గ్లామర్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టిన ప్రియమణి, వెనక్కి తిరిగి చూసుకోలేదు.
టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గినా బాలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్‌లో ఆమెకి డిమాండ్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.
నాలుగు పదుల వయసొచ్చినా.. ఇప్పుడొస్తున్న హీరోయిన్లకు ఏమాత్రం తగ్గనని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
కేవలం గ్లామర్ ఇండస్ట్రీ వైపు మాత్రమే కాకుండా బుల్లితెరపైనా నానాహంగామా చేస్తోంది.
ఆ విధంగా బుల్లితెర అభిమానులకు పోగేసుకుంది. తనకు సెపరేట్‌గా ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది.
వారి కోసం వెరైటీగా ఫోటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్‌గా ట్రెడిషనల్ శారీలో ఫోటోషూట్ చేసింది. అందులో తనకు జస్ట్ 30 ఏళ్లంటూ నిరూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రియమణి ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి.