BigTV English

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?
Advertisement

Samantha -Raj Nidumori: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత (Samantha) ఇటీవల కాలంలో తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలుస్తుంది. ఈమెకు నటుడు నాగచైతన్య(Nagachaitanya) నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత మరొక డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori) ప్రేమలో ఉన్నారు అంటూ తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం చాలా క్లోజ్ గా ఫోటోలు దిగడం చూస్తుంటే ఈ వార్తలు నిజమేనని భావన అందరిలో కలుగుతుంది.


సమంత రాజ్ పెళ్లి చేసుకోబోతున్నారా?

సమంత రాజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఎక్కడ సమంత స్పందించకపోవడం గమనార్హం. వీరిద్దరి గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో సమంత డైరెక్టర్ రాజ్ అండ్ డీకే చేసిన ఒక పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్లు చేయడంతో మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే గ్రాజియా(Grazia) కూల్ లిస్ట్ 2025 లో ఫీచర్అయ్యారు. ఈ విషయాన్ని గ్రాజియా అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇదే పోస్టును రాజ్ అండ్ డీకే ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ పై సమంత కామెంట్ చేయటంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

ద కూలెస్ట్ అంటూ..

ఇక ఈ పోస్ట్ పై సమంత స్పందిస్తూ ద కూలెస్ట్ అంటూ హార్ట్ సింబల్ తో కామెంట్ చేయడంతో ఈ కామెంట్ పై నెటిజన్స్ కూడా స్పందిస్తూ.. బావ అక్కని బాగా చూసుకో అంటూ కామెంట్లు చేయగా మరికొందరు వీళ్లిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా? అంటూ ఈ పోస్టుపై పెద్ద ఎత్తున చర్చలు జరపడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా ఈ పోస్టును సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ రెడ్ కలర్ హార్ట్ సింబల్ ఎమోజిని పెట్టడంతో మరోసారి వీరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సమంత ఇలా ఈ పోస్టుపై స్పందించడంతో పరోక్షంగా ఈమె తన రిలేషన్ ని కన్ఫర్మ్ చేసిందా? అంటూ కూడా పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.


ఏది ఏమైనా సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత రాజ్ తో చాలా క్లోజ్ గా ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు వస్తున్నాయి అయితే ఈ వార్తలపై సమంత స్పందిస్తూ ఏదో ఒక విషయాన్ని తెలియచేస్తే తప్ప ఈ వార్తలకు పులిస్టాప్ పడదని చెప్పాలి. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె రక్త బ్రాహ్మండ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు .అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాకు కమిట్ అయ్యారని త్వరలోనే ఈ సినిమా కూడా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు స్వయంగా సమంత నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

Also Read: Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Related News

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Raviteja-Sreeleela: శ్రీ లీల నటన పై రవితేజ కామెంట్స్.. ఇంకా బయట పెట్టలేదంటూ!

Prabhas: ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రానున్న అప్డేట్స్ , సుకుమార్ కల నెరవేరినట్లే

Akhanda 2 : అఖండ 2 టీం కు జియో హాట్ స్టార్ కండిషన్స్, మరి ఇంతలో ఇన్వాల్వ్ అవుతారా?

Suriya 46 : అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన మాస్ మహారాజా కొడుకు, యాక్టింగ్ కు దూరమైనట్లేనా? 

Big Stories

×