Emmanuel: బిగ్ బాస్ సీజన్ 9 లో చాలామంది ఇష్టపడే కంటెంట్ ఇమ్మానుయేల్. జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు ఇమ్మానుయేల్. జబర్దస్త్ అనే షో చాలామంది కమెడియన్సు ను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్స్ ఇంకో ఇండస్ట్రీలో లేరు అనేది వాస్తవం. ఆ గుర్తింపు ద్వారా బిగ్ బాస్ కి వచ్చిన ఇమ్మానుయేల్ అక్కడ కూడా అందర్నీ ఎంటర్టైన్ చేస్తూ కలిసిపోయాడు.
కొన్ని సందర్భాల్లో ఇమ్మానుయేల్ ప్రవర్తించే తీరు చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయ్యేది. అలానే అందర్నీ ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. జబర్దస్త్ షో తో గుర్తింపు ఉండటం వలన కూడా కొంత ఆదరణ ఆయనకు లభించింది. అయితే భరణి ఎలిమినేట్ అవ్వడం వెనక ఎక్కువ శాతం ఇన్వాల్వ్మెంట్ ఇమ్మానుయేల్ ది ఉంది.
హౌస్ లోకి భరణి ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదటి పలకరించింది ఇమ్మానుయేల్ ని. అప్పటినుంచి వీరిద్దరి మధ్య బాండింగ్ బాగా పెరిగింది. అన్నయ్య అని భరణిను ఇమ్మానుయేల్ చాలా ప్రేమగా పిలిచేవాడు. చాలా విషయాలను భరణితో ఇమ్మానియేల్ షేర్ చేసుకునేవాడు. హౌస్ లో వీళ్ళిద్దరూ చాలా ప్రత్యేకంగా కనిపించారు అనేది వాస్తవం.
కానీ ఈరోజు ఎలిమినేషన్ ప్రక్రియలు భరణి మరియు రాము ఉంటే, వారిద్దరిలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇమ్మానుయేల్ కి ఉంది. చాలామంది కూడా ఇమ్మానుయేల్ భరణిని మాత్రం సేవ్ చేస్తారు అని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రీసెంట్ టైమ్స్ లో భరణి అన్న గేమ్ కనిపించట్లేదు అని రామును సేవ్ చేశాడు. వారిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి భరణిని సేవ్ చేయాల్సి ఉంది. భరణి కూడా అదే ఊహించి ఉంటాడు. కానీ కొంతమందికి ఈ విషయంలో ఇమ్మానుయేల్ మోసం చేశాడు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది.
ఎలిమినేషన్ కి సిద్ధంగా భరణి మరియు రాము ఉన్నారు. రాము గురించి రీతూ చౌదరి తో మాట్లాడుతూ చాలా నెగిటివ్ కామెంట్స్ చేశాడు ఇమ్మానుయేల్. రాముది తన తప్పుంటే ఆ పాయింట్ వదిలేద్దాం అని దాటేస్తాడు. అలానే కొన్ని విషయాల్లో వెంటనే మాట మార్చేస్తాడు అని రీతు చౌదరితో గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తూ మరీ చెప్పాడు.
కానీ ఈరోజు రామును సేవ్ చేశాడు అంటే. భరణిను నిజంగా తనకు స్టఫ్ కాంపిటేషన్ అని ఫీలై ఉంటాడు. భరణిను తొలగిస్తే తను గేమ్ ఆడటానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే రాముని సేవ్ చేసి ఉంటాడు అనేది కొంతమందికి కలిగే అభిప్రాయమని ఖచ్చితంగా చెప్పొచ్చు.