Bigg Boss Bharani : బిగ్ బాస్ సీజన్ 9 లో భరణి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరణి ఆరు వారాలు ఆట చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో అయితే నిలబడతాడు అనే నమ్మకం ఉండేది. రెండు వారాలు బయట నుంచి గేమ్ చూసి వచ్చిన దివ్య కూడా భరణి గేమును ప్రశంసిస్తూ తనతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది.
భరణి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి బాగానే గేమ్ ఆడాడు. ఎప్పుడైతే తనుజ నాన్న అని పిలవడం మొదలుపెట్టిందో, అక్కడితో చాలా బంధాలకు ముడి పడిపోయాడు. కొన్ని రోజులు తర్వాత దివ్య ఎంట్రీ ఇచ్చింది. దివ్య ఎంట్రీ తో తనుజాను దూరం పెట్టాడు అంటూ ఆవిడ బాధ పడింది, మరోవైపు పట్టించుకోవట్లేదు అంటూ సంజన బాధపడింది. వీళ్లు ఇలా ఫీల్ అవుతున్నారు అంటూ దివ్య బాధ పడింది. మొత్తానికి వీళ్ళ బాధలు నడుమ ఈరోజు భరణి బాధపడాల్సి వచ్చింది.
భరణి ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయే కొన్ని క్షణాల ముందే భరణికి తెలిసిపోయింది. అందుకే ఎలిమినేషన్ లో ఉన్న రాము రాథోడ్ దగ్గరికి వెళ్లి నువ్వు సేఫ్ అని హగ్ చేసుకుని మరి ప్రేమతో కిస్ ఇచ్చాడు. హౌస్ నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా చాలా జెంటిల్మెన్ లాగా బయటికి వచ్చాడు.
అయితే సంజనా తో తనకి ఇష్యూ ఉంది అని తను అనుకుంటుంది. హౌస్ నుంచి వెళ్ళిపోతూ కూడా మీ పైన నాకు ఎటువంటి చెడు అభిప్రాయం గానీ లేదు. నువ్వు వెళ్ళిపోతూ కూడా క్లారిటీ ఇస్తున్నాను అంటూ సంజనాతో మాట్లాడాడు.
మరోవైపు ఈ హౌస్ లో నా వలన ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే అది నీకు మాత్రమే పవన్ అని చెబుతూ డిమాన్ పవన్ కి కూడా సారీ చెప్పాడు. పవన్ కూడా దానిని యాక్సెప్ట్ చేశాడు.
వాస్తవానికి భరణిను సేవ్ చేసే అవకాశం ఇమ్మానుయేల్ చేతిలో ఉంది. పవర్ అస్త్ర ఉపయోగించుకొని భరణిను సేవ్ చేయొచ్చు కూడా. కానీ ఇమ్మానుయేల్ రాము రాథోడ్ ను సేవ్ చేశాడు. వాస్తవానికి భరణికు మరియు ఇమ్మానుయేల్ కు మధ్య మంచి బాండింగ్ ఉండేది. హౌస్ కి ఎంట్రీ ఇచ్చినప్పుడు మొదట భరణి పలకరించింది ఇమ్మానుయేల్ ని.
కానీ పవర్ అస్త్ర ఉపయోగించి రామును సేవ్ చేశాడు ఇమ్మానియేల్. భరణి అన్న వచ్చిన రెండు వారాలు గేమ్ బాగా ఆడారు. కానీ కొన్ని కారణాల వలన తర్వాత తనను నేను కంప్లీట్ గా చూడలేకపోయాను. నా దగ్గర ఉన్న పవర్ తో నేను రాముని సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. అలా భరణి ఎలిమినేట్ అవడంలో ఇమ్మానుయేల్ ఇన్వాల్వ్ అయ్యాడు.
Also Read: Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్