E-Paper
Advertisement

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : మొగుడిని వదిలేసి చెఫ్ తో… ఆ సీన్లయితే అరాచకం మావా… సింగిల్ గా ఉన్నప్పుడే చూడండి
Advertisement

OTT Movie : రొమాంటిక్ సినిమాలను చూడాలంటే, మొదటగా హాలీవుడ్ సినిమాలను చూడాల్సిందే. వీటిలో యూత్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. అంతే కాదు అప్పుడప్పుడు హద్దులు దాటే సీన్స్ కి మాత్రం కొదవ ఉండదు. అందుకే ఈ సినిమాలను చూడటానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా, రొమాంటిక్ సీన్స్ తో పాటు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ని  ఆకట్టుకుంటోంది. ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘వీ లివ్ ఇన్ టైమ్’ (We Live in Time) అనేది ఒక అమెరికన్ రొమాంటిక్ సినిమా. జాన్ క్రౌలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆండ్రూ గార్ఫీల్డ్ (టోబియాస్), ఫ్లోరెన్స్ ప్యూ (అల్మట్), గ్రేస్ డెలానే (అబిగైల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 సెప్టెంబర్ 6న టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అయింది. 2024 అక్టోబర్ 11లో థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం Netflix లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

Advertisement

అల్వా అనే యువతి ఒక టాలెంటెడ్ చెఫ్. తన భర్తతో విడిపోయి ఒక రెస్టారెంట్‌ను నడుపుతూ, కెరీర్‌పై ఫోకస్ చేస్తుంటుంది. ఒక రోజు ఆమె టోబియాస్ అనే యువకుడిని అనుకోకుండా కలుస్తుంది. టోబియాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. వీళ్ళు త్వరగానే ప్రేమలో కూడా పడతారు. అల్వా, టోబియాస్ మధ్య స్వీట్, ఫన్నీ మూమెంట్స్ జరుగుతాయి. వాళ్లు కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, ఫ్యూచర్ ఎలా ఉండాలో కలలు కూడా కంటారు. కానీ ఇప్పుడు ఒక ఊహించని ట్విస్ట్ వస్తుంది. అల్వాకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఈ విషయం వాళ్ల ప్రేమను, జీవితాన్ని షేక్ చేస్తుంది. అల్వా ఈ జబ్బుకి ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. టోబియాస్ ఆమెకు అండగా ఉంటాడు.

Read Also : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

Advertisement

వాళ్లు కలిసి ఇప్పుడు చిన్న చిన్న సంతోషాలను ఎంజాయ్ చేస్తారు. అల్వా క్యాన్సర్‌తో పోరాడుతూ, టోబియాస్‌తో కలిసి జీవితాన్ని పూర్తిగా జీవించాలని కోరుకుంటుంది. వీళ్ళ ప్రేమకు ప్రతి రూపంగా ఒక బిడ్డను కూడా కంటారు. ఇది వాళ్ల జీవితంలో కొత్త హోప్ తెస్తుంది. అల్వా క్యాన్సర్‌తో పోరాడుతూ, టోబియాస్, వాళ్ల బిడ్డతో సమయం గడుపుతుంది. వాళ్లు ప్రతి క్షణాన్ని స్పెషల్‌గా మార్చుకుంటారు. అయితే ఈ సమయంలో అల్వా ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. ఇక క్లైమాక్స్ హార్ట్‌ బ్రేకింగ్ ఎండింగ్‌తో ముగుస్తుంది. అల్వా క్యాన్సర్ ని జయిస్తుందా ? ఓడిపోతుందా ? ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×