ప్రోటీన్ స్మూతీస్: సారా టెండూల్కర్ పైనాపిల్, మామిడి మరియు మాచా ప్రోటీన్ స్మూతీస్ లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ స్మూతీలు చర్మానికి చాలా మంచిది. ఇవి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఎంతగానో సహాయం చేస్తాయి.
తక్కువ కార్బ్ ఆహారం: సారా టెండూల్కర్ తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అంతే కాకుండా చక్కెర చాలా తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తినడానికి ఇష్టపడతారు. చక్కర ఉన్న ఆహారాన్ని అసలు తీసుకోరట.
ఉదయం: ఉదయం లేచిన వెంటనే నీరు తాగి తన రోజున ప్రారంభిస్తారు. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్, గింజలు తినడం బ్లాక్ కాఫీ తాగి వర్కౌట్స్ ప్రారంభిస్తుందట. అనంతరం బాయిల్డ్ ఎగ్స్, ఫ్రూట్స్, సలాడ్ లను తింటూ ఉంటుంది.
సమతుల్య ఆహారం: సారా ( Sara Tendulkar) మధ్యాహ్న భోజనం లో ఆకుకూరలు మాత్రమే తింటుంది. ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంది. జొన్న రొట్టె, రాగి రొట్టె లాంటి వాటిని మాత్రమే తింటుంది.
మిలేట్స్: సారాకు మిలేట్స్ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు వాటిని తినకుండా అస్సలు ఉండలేదట.
ఇక సాయంత్రం సమయంలో వాకింగ్ తప్పకుండా చేస్తోంది. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో సారా వాకింగ్ చేస్తూ ఉంటుంది. వాకింగ్ సమయంలో సంగీతాన్ని వింటూ చాలా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో వాకింగ్ చేస్తుంది.
రాత్రి సమయంలో పెరుగు అన్నం లేదా చపాతి తింటుంది. ఆ తర్వాత కాసేపు బయట కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఆ తర్వాత పడుకునే ముందు ఒక గ్లాసుడు పాలు తాగి నిద్రపోతుంది. వీటన్నింటినీ ఫాలో అవుతూ సారా టెండూల్కర్ ( Sara Tendulkar) చాలా చక్కగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. చాలా మంచి ఆహారాన్ని ( Food) తీసుకుంటూ ఎంతో చక్కగా తన డైట్ ను కొనసాగిస్తోంది. ఎంతో అందంగా ప్రతి ఒక్కరి మనసులను దోచుకుంటుంది.