Brahmamudi serial today Episode: ఎక్స్ ఫోలో ఎదురుపడ్డ కావ్యను రుద్రాణి తిడుతుంది. ఇంటికి రావడానికి ఇష్టం లేదు కానీ ఇక్కడకు వచ్చి రాజ్ ను ఎలాగైనా మార్చుకోవాలి చూస్తున్నావా? అంటూ నిలదీస్తుంది. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా రాజ్ మారడని చెప్తుంది. ఇంతలో స్వప్న కల్పించుకుని అందరూ మీ లాగా మీ ఆయన లాగా ఉంటారని ఎలా అనుకుంటావు అత్తా అంటుంది. సుభాష్ మాత్రం అవన్నీ ఎందుకు కానీ ఎలాగూ వచ్చావు ఇక రా కావ్య లోపలికి వెళ్దాం అంటాడు.
రాజ్ ఎవరు పిలిచారు. ఎవరి కోసం వచ్చారు అని ప్రశ్నించడంతో కావ్య తాను మీ కోసం రాలేదని నాకు పనుండి వచ్చాను అని చెప్తుంది. ఈ వంకతో మాటిమాటికి ఎదురుపడి రాజ్ మనసు మార్చాలని చూస్తున్నావేమో అలా ఎప్పటికీ జరగదు అంటుంది రుద్రాణి. మరి ఇంటికి రమ్మంటే రాని వాళ్లు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లో.. అని రాజ్ అడుగుతాడు. ఇంటికి రమ్మని నెలకింత ఇస్తానంటూ ఖరీదు కట్టే షరాబులు ఇక్కడ ఉండరు అనుకున్నాను తమరు వస్తారని నాకేం తెలుసు అంటుంది కావ్య.
రాజ్ కంగారు పడతాడు. ఎక్కడ తాను కావ్యకు కిరాయి ఇస్తానన్న విషయం తెలుస్తుందని.. ఇంతలో సుభాష్ ఏంటమ్మా ఏమంటున్నావు అని అడుగుతాడు. దీంతో కావ్య మీ అబ్బాయి గారినే అడగండి మామయ్యగారు అంటుంది. వెంటనే రాజ్ కొన్ని పీడకలలు నిద్ర లేవగానే మర్చిపోవాలి డాడ్ అంటాడు. ఎదుటి వాళ్ల కళలు ఆశలు, ఆశయాలు అన్ని తొక్కి పారేసి మర్చిపోవాల్సిందేనా..? అంటూ ప్రశ్నిస్తుంది. స్వప్న మాత్రం మరి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావే అని అడుగుతుంది. తాను ఓ చిన్న కంపెనీలో డిజైనర్ గా చేస్తున్నానని వాళ్లే ఇక్కడికి రమ్మంటే వచ్చానని కావ్య చెప్తుంది. తర్వాత అందరూ లోపలికి వెళ్లిపోతారు.
లోపల సామంత్ తో ఉన్న అనామికను చూసి రాజ్, సుభాష్ షాక్ అవుతారు. రుద్రాణి కూడా ఏమీ తెలియనట్టు షాక్ అయినట్టు నటిస్తుంది. ఏంటి అనామిక నువ్వు మళ్లీ డబ్బు్‌న్న వాళ్లనే పట్టిట్టున్నావు అంటుంది రుద్రాణి. చూశావా అన్నయ్య అనామిక ఎలా మారిపోయిందో అంటుంది. దీంతో సుభాష్ తన జీవితం తాను చూసుకుంది ఇందులో తప్పేముంది అంటాడు.
ఇంతలో సామంత్ ఈసారి మా కంపెనీ అవార్డు గెలవబోతుంది. పదేళ్ల మీ ఆధిపత్యానికి మేమే అడ్డుకట్ట వేయబోతున్నాం.. మీ కంపెనీకి ఎవరూ పోటీ లేరనుకున్నారు. ఇప్పుడు మేమున్నాం అంటాడు. దీంతో రాజ్ మంచిదే పోటీ ఉంటేనే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాం అంటాడు. ఎవరు గెలుస్తారో ఇంకొద్ది సేపట్లో తెలుస్తుంది కదా అంటాడు. మేము గెలిచాక మీరు కూడా చప్పట్లు కొట్టాల్సిందే అంటాడు సామంత్. సరే చూద్దాం అంటాడు రాజ్.
మరోవైపు హాల్లో ఇందిరాదేవి, ధాన్యలక్ష్మీ, సీతారామయ్య, ప్రకాష్ కూర్చుని టీవీ చూస్తుంటారు. లోపలి నుంచి అపర్ణ వచ్చి న్యూస్ పెట్టమని చెప్తుంది. ఎక్స్ ఫో గురించి ఏదైనా చానెల్ లో లైవ్ వస్తుందేమో అంటుంది. దీంతో అవును వదిన నేను మర్చే పోయాను అంటాడు ప్రకాష్. దీంతో మీరు ఏది గుర్తు పెట్టుకున్నారో ఒక్కటి చెప్పండి చూద్దాం అంటుంది ధాన్యలక్ష్మీ.
నిన్ను గుర్తు పెట్టుకున్నాను కదే ధాన్యం అంటాడు ప్రకాష్. మీ మొగుడు పెళ్లాల గొడవ ఆపి ఆ లైవ్ చూడండి అంటుంది అపర్ణ, టీవీలో యాంకర్ గత పదేళ్లుగా స్వరాజ్ గ్రూప్ అవార్డు గెలుస్తూ వస్తుంది. ఈసారైనా కొత్త కంపెనీ అవార్డు గెలుస్తుందేమో చూడాలి అని చెప్తుంది. అది విన్న ప్రకాష్ కొత్త కంపెనీయా.. ఈసారి కూడా మా రాజ్ అవార్డు గెలుస్తాడు అని అంటాడు. అందరూ నవ్వుకుంటారు.
ఎక్స్ ఫోకు వచ్చి కావ్యను పలకరిస్తాడు సురేష్. నా డిజైన్స్ ఎవరికో కావాలి అన్నారు కదా? తీసుకెళ్లి పరిచయం చేస్తే మాట్లాడి వెళ్లిపోతాను అంటుంది కావ్య. అంత అర్జెంట్ పని ఏమైనా ఉందా? అని సురేష్ అడుగుతాడు. పనేం లేదు కానీ ఇక్కడ ఉండటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తుంది కావ్య. అదేంటమ్మా ఇక్కడ అందరూ చాలా బిజీగా ఉన్నారు అవార్డు అనౌన్స్ అయిపోయాక కలుద్దువు అంటాడు.
కావ్య సరే నేను మరో రోజు వస్తాను అని చెప్పి వెళ్లబోతుంటే ఆగమ్మా అలా తొందరపడితే ఎలా ఈ ఈవెంట్ లో ఎలాంటి డిజైన్ కు అవార్డు వచ్చిందో నువ్వు చూసి తెలుసుకోవాలి కదా? అంటాడు. దీతో కావ్య నేను అలాంటివన్నీ పట్టించుకోనండి అంటుంది. కానీ ఇంత దూరం వచ్చాక ఒక్క 20 నిమిషాలు ఆగండి తర్వాత వెళ్లిపోదురు అంటూ కావ్యను తీసుకెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు సురేష్. వీళ్లిద్దరినీ దూరం నుంచి గమనిస్తుంటాడు రాజ్.
రాజ్ కు ఎదురుగా కూర్చున్న కావ్య స్వప్న పక్కకు తీసుకెళ్లి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసులే అంటుంది. రాజ్ కోసమే వచ్చావు కదా అంటుంది. అవార్డు రాగానే రాజ్‌కు కంగ్రాట్స్ చెప్పు తర్వాత సారీ చెప్పు అంటుంది స్వప్న. దీంతో కావ్య నేను సారీ ఎందుకు చెప్పాలి అక్కా అంటూ ఎదరు ప్రశ్నిస్తుంది. సారీ చెబితే అయన మారతారనుకుంటే ఇప్పటికే లక్ష సార్లు మారాలి. ఎందుకంటే మా పెళ్లి అయినప్పటి నుంచి నేను ఆయనకు లక్ష సార్లు సారీ చెప్పి ఉంటాను అంటుంది కావ్య. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్ కు ఎండ్ కార్డు పడుతుంది.