Mitchell Starc: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య ఇవాళ తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొలి వన్డే నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరు వేయనంత స్పీడ్ తో బంతి సంధించాడు. ఇండియా పై జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో 176.5 kph వేగంతో ఓ బంతిని సంధించాడు మిచెల్ స్టార్క్. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి వేసినట్లు మిచెల్ స్టార్క్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అది గన్ సాంకేతిక తప్పిదమని, అందులో నిజం లేదని చెబుతున్నారు. కానీ పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్ రికార్డును మిచెల్ స్టార్క్ బద్దలు కొట్టినట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య ఇవాళ తొలి వన్డే జరిగిన నేపథ్యంలో కంగారు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 22 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో ఫాస్టెస్ట్ బంతులు వేసిన పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ రికార్డును బద్ధలు కొట్టాడు. గత 22 ఏళ్ల కిందట 161.3 km/h వేగంతో బంతులు సంధించాడు షోయబ్ అక్తర్. అయితే, ఆ రికార్డును ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
అయితే, ఇందులో వాస్తవం లేదని చెబుతున్నారు. ఇవాళ్టి మ్యాచ్ లో స్పీడ్ మీటర్ సరిగ్గా పనిచేయడం లేదని అంటున్నారు. 176.5 kph వేగంతో ఓ బంతిని సంధించడం అసలు వీలు కాదని అంటున్నారు విశ్లేషకులు. స్పీడ్ మీటర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే, 176.5 kph వేగంతో బంతిని వేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య ఇవాళ తొలి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధించింది. టీమిండియాపై 7 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఈ తరుణంలో, 1-0 తేడాతో లీడింగ్ సాధించింది ఆసీస్. ఈ మ్యాచ్ మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 26 ఓవర్స్ లో 9 వికెట్లు నష్టపోయి, 136 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని 21.1 ఓవర్లలో 3 వికెట్లు 131 పరుగులు చేసి, విజయం సాధించింది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) వన్డే మ్యాచ్ కు పదే పదే వర్షం అడ్డంకిగా మారింది. ఈ తరుణంలోనే, టీమిండియా మైనస్ అయింది. 50 ఓవర్ల మ్యాచ్ ను కాస్త 26 ఓవర్లకు డక్ వర్త్ లుయిస్ పద్ధతి ప్రకారం ఫిక్స్ చేశారు. అటు టీమిండియా టాస్ ఓడిపోవడంతో, మ్యాచ్ కూడా చేజారింది.
🚨 Mitchell Starc shatters Shoaib Akhtar’s 22-year-old record for the fastest ball ever bowled! ⚡🏏
● Shoaib Akhtar’s record: 161.3 km/h (100.23 mph)
● Starc’s thunderbolt vs India: 176.5 km/h (109 mph)#INDvsAUS pic.twitter.com/3JEVKGRNoW— KhilariTak (@khilaritak) October 19, 2025