Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉండేవారు. అయితే ఈయన తన దృష్టి మొత్తం రాజకీయాల వైపు పెట్టడంతో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ప్రస్తుతం రాజకీయాల పరంగా ఉన్నత హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో ఈయన కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు. ఇక ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వరని వార్తలు వచ్చాయి కానీ పవన్ మాత్రం వరుస సినిమాలను లైన్లో పెట్టడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓజీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ దిల్ రాజు(Dil Raju)తో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు రెండు సినిమా కథలను సెలెక్ట్ చేశారని ఇందులో దాదాపు ఒకటి ఖరారు అయిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు అద్భుతమైన కథను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎన్నో పాత్రలలో నటించారు కానీ లెక్చరర్ పాత్రలో మాత్రం చేయలేదు ఇలా మొదటిసారి పవన్ కళ్యాణ్ పాఠాలు చెప్పే మాస్టర్ గా కనిపించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ దిల్ రాజు సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే త్వరలోనే అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.
వకీల్ సాబ్ సినిమాతో హిట్ కొట్టిన దిల్ రాజు…
ఇక పవన్ కళ్యాణ్ దిల్ రాజు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో చివరిగా వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. ఇక ఇటీవల దిల్ రాజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపారు. అయితే రాజకీయాలలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారని ఆయన రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా, మా కోసం ప్రతి ఏడాది ఒక సినిమా చేయాలి అంటూ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేసిన దిల్ రాజు ఏకంగా తన బ్యానర్ లోనే పవన్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు అధికారకంగా తెలియనున్నాయి.
Also Read: Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?