OTT Movie : కొరియన్ లవ్ స్టోరీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఈ వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని కూడా ప్రేమలో ఇన్వాల్వ్ చేస్తాయి. అంత స్వీట్ గా ఈ ప్రేమ కథలు ఉంటాయి. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక కొరియెన్ సిరీస్భ, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అలరిస్తోంది. ఈ స్టోరీలో ప్రేమికులకు ఒక వింత సమస్య ఉంటుంది. ఒకరికి ఎవరినైనా ముట్టు కోవడం అంటే భయం. మరొకరికి కళ్ళల్లోకి చూడటం అంటే భయం. ఈ సమస్యలతో నడిచే ఈ ప్రేమకథ చాలా స్వీట్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివారాల్లోకి వెళ్తే ..
‘రొమాంటిక్స్ యాననిమస్’ (Romantic anonymous) 2025లో వచ్చిన కొరియన్ రొమాంటిక్ డ్రామా సిరీస్. షో ట్సుకికవా దీనిని రూపొందించారు. ఇందులో షున్ ఓగూరి, హాన్ హ్యో-జూ, యూరి నాకమురా, జిన్ అకానిషి ప్రధాన పాత్రల్లో నటించారు. 8 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్, ప్రతి ఎపిసోడ్ దాదాపు 50 నిమిషాల నిడివిని కలిగి ఉంది. ఇది 2025 సెప్టెంబర్ 19న బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 2025 అక్టోబర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 8.2/10 రేటింగ్ ఉంది.
సోసుకే ఒక చాక్లెట్ షాప్ ఓనర్, అద్భుతమైన చాక్లెట్స్ ను తయారు చేస్తాడు. కానీ అతనికి ఒక సమస్య ఉంది. అతనికి హాపో ఫోబియా అనే వింత జబ్బు ఉంటుంది. దీంతో అతను ఇతరులను తాకడానికి భయపడతాడు. అందుకే ఎవరినీ తాకాలేక, ఒంటరిగా షాప్ నడుపుతుంటాడు. అదే సమయంలో హనా అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె కూడా చాక్లెట్ నిపుణురాలు. ఆమెకు కూడా ఒక సమస్య ఉంది. ఇతరుల చూపులకు భయపడుతుంది. అందుకే ఆమె చాక్లెట్స్ ను సీక్రెట్ గా అమ్ముతుంది. ఒక రోజు సోసుకే షాప్‌కు హనా చాక్లెట్ టేస్ట్ చేయడానికి వస్తుంది. సోసుకే, హనా మధ్య చాక్లెట్ మ్యాజిక్‌తో ప్రేమ మొదలవుతుంది. కానీ వాళ్ల భయాలు (సోసుకే తాకడానికి, హనా చూడడానికి భయపడటం) సమస్యలు తెస్తాయి.
Read Also : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే
అయితే వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుని, చాక్లెట్ మేకింగ్ ద్వారా తమ భయాలను అధిగమించడానికి ట్రై చేస్తారు. ఈ కథలో ఫన్నీ సీన్స్, రొమాంటిక్ మూమెంట్స్, చాక్లెట్ రెసిపీలు మిక్స్ అవుతాయి. సోసుకే, హనా తమ భయాలను ఒకరికొకరు చెప్పుకుని దగ్గరవుతారు. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతున్న సమయంలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. క్లైమాక ఒక ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. చివరికి సోసుకే, హనా తమ భయాలను, సమస్యలను సాల్వ్ చేసుకుంటారా ? వీళ్ళ ప్రేమకి శుభం కార్డ్ పడుతుందా ? అనే విషయాలను, ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.