INDW vs ENGW: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 19 మ్యాచ్ లు చాలా సక్సెస్ ఫుల్ గా జరిగాయి. ఇవాళ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య 20 వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతులో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో టీమిండియా సెమీస్ ఛాన్సులు కఠినతరం అయ్యాయి. ఈ విజయంతో తొమ్మిది పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్, నేరుగా సెమీఫైనల్ కు వెళ్ళింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్ళగా, ఇవాళ ఇంగ్లాండ్ కూడా దూసుకు వెళ్ళింది. మరో జట్టు సెమీ ఫైనల్ కు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగో స్థానం కోసం టీమిండియా, న్యూజిలాండ్ రెండు జట్లు కూడా పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏదో ఒక టీం సెమీ ఫైనల్ కు వెళుతుంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ జరిగిన మ్యాచ్ లో స్మృతి మందాన అలాగే హార్మన్ ఇద్దరు అద్భుతంగా రాణించారు. కానీ వీళ్ళిద్దరూ చివరి వరకు బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించలేకపోయారు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 50 ఓవర్స్ ఆడిన ఇంగ్లాండ్ మహిళల జట్టు 8 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ జోన్స్ 56 పరుగులు చేయగా నైట్ 109 పరుగులతో రెచ్చిపోయింది. అటు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రాంట్ 38 పరుగులతో రెచ్చిపోయింది.
దీంతో 288 పరుగుల భారీ టార్గెట్ ను టీమిండియా ముందు ఉంచింది ఇంగ్లాండ్. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా కూడా మంచి ఆరంభం అందుకుంది. లేడీ కోహ్లీ స్మృతి మందాన 88 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 70 పరుగులు చేశారు. అటు దీప్తి శర్మ కూడా 50 పరుగులతో దుమ్ము లేపారు. కానీ చివర్లో కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 284 పరుగులు మాత్రమే చేసింది. దీంతో నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా.
ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాకు ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. తన తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధిస్తే ఖచ్చితంగా సెమీ ఫైనల్ కు వెళ్తుంది. న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ జట్లతోనే నెక్స్ట్ ఇండియాకు మ్యాచ్ లు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు మ్యాచ్ లలో టీమిండియా ఓడిపోతే న్యూజిలాండ్ సెమీస్ కు దూసుకు వెళ్తుంది.
England Women handed India Women their third straight defeat of this World Cup 🏏
Deepti Sharma's fighting knock goes in vain.#CWC25 #DeeptiSharma #EnglandCricket #WomensWorldCup2025 #CricketTwitter pic.twitter.com/CtHvCDkTFy
— InsideSport (@InsideSportIND) October 19, 2025