OTT Movie : ఓటీటీలోకి అదిరిపోయే హారర్ సిరీస్ లు వస్తున్నాయి. కొన్ని సిరీస్ లు సస్పెన్స్ తో గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వచ్చిన బెంగాలీ హారర్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ కథ సోనముఖి అనే గ్రామంలో జరుగుతుంది. అక్కడ ఎవరైనా మ్యూజిక్ ప్లే చేస్తే, ఒక శక్తి వాళ్ళని చంపుతుంటుంది. హారర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన స్టోరీ ఇది. ప్రతి క్షణం ఉత్కంఠంగా ఉండే ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘నిషిర్ దాక్’ (Nishir Daak) 2025లో వచ్చిన బెంగాలీ హారర్ మిస్టరీ వెబ్ సిరీస్. జోయ్‌దీప్ ముఖర్జీ దర్శకత్వంలో సురంగనా బంద్యోపాధ్యాయ, శ్రీజా దత్త ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ సీజన్ 1, ఆరు ఎపిసోడ్లతో 2025 అక్టోబర్ 17న Hoichoi ఓటీటీలో విడుదల అయింది. ఈ బెంగాలీ సిరీస్ తెలుగు, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. IMDbలో 7.2/10 రేటింగ్ కూడా పొందింది.
సోన ముఖి అనే చిన్న గ్రామంలో ఈ కథ మొదలవుతుంది. ఇక్కడ “నిషిర్ దాక్” అనే శక్తి ఉంటుంది. రాత్రి సమయంలో ఎవరైనా మ్యూజిక్ వాయిస్తే ఒక చెడు శక్తి వాళ్ళను చంపుతుంటుంది. ఈ గ్రామంలోకి ఆరుగురు పీహెచ్‌డీ స్టూడెంట్స్, టిట్లి నేతృత్వంలో ఒక రీసెర్చ్ కోసం వస్తారు. వాళ్లు నిషిగంధ అనే ఒక ఒక సింగర్ గురించి స్టడీ చేయడానికి వస్తారు. గ్రామస్తులు వీళ్లను ఇక్కడ మ్యూజిక్ వాయించొద్దని, అలా చేస్తే నిషిర్ దాక్ అనే శక్తి వస్తుందని హెచ్చరిస్తారు. కానీ టిట్లి, ఆమె ఫ్రెండ్స్ దీన్ని నమ్మకుండా, రీసెర్చ్ కోసం వాళ్లు నిషిగంధ మ్యూజిక్ రికార్డ్‌ను ప్లే చేస్తారు. అక్కడ నుండి గోల స్టార్ట్ అవుతుంది. రాత్రి ఒక వింత వాయిస్ వినిపిస్తుంది. ఆతరువాత ఒక స్టూడెంట్ మిస్సింగ్ అవుతాడు.
Read Also : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్
ఆ స్టూడెంట్ బాడీ గ్రామంలోని ఒక లేక్‌లో కనిపిస్తుంది. దీంతో టిట్లి, ఆమె ఫ్రెండ్స్ భయపడతారు. వాళ్లు రూల్ బ్రేక్ చేసి మ్యూజిక్ ప్లే చేయడంతో గ్రామస్తులు కూడా వీళ్లపై కోపంగా ఉంటారు. ఇప్పుడు టిట్లి నిషిగంధ గతాన్ని డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నిషిగంధ ఒకప్పుడు గొప్ప సింగర్. ఆమె మ్యూజిక్ గ్రామాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడేది. కానీ ఒక చెడు శక్తి ఆమె మ్యూజిక్‌ను కర్స్‌గా మార్చింది. ఈ కర్స్ వల్ల రాత్రి సమయంలో మ్యూజిక్ విన్నవాళ్లు ఆ శక్తి పిలుపు విని మరణిస్తారు. మరో స్టూడెంట్ కూడా ఒక పాట విన్న తర్వాత అడవిలో చనిపోతాడు. టిట్లి దీన్ని బ్రేక్ చేయడానికి ఒక మార్గాన్ని తెలుసుకుంటుంది. ఒక రిస్కీ రిచ్యువల్ చేస్తే ఆ శక్తిని అడ్డుకోవచ్చని తెలుసుకుంటుంది. వాళ్లు గ్రామస్తుల సహాయంతో రిస్కీ రిచ్యువల్ చేస్తారు. ఈ రిచ్యువల్ ఏమిటి ? ఆ శాపం ఎలా వచ్చింది ? స్టూడెంట్స్ దాన్ని అడ్డుకుంటారా ? ఆ గ్రామం గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోవాల్సిందే.