Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ కూతురు ప్రియాంకగాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగేశారు.

తొలిసారి కేరళలోని వాయనాడ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బుధవారం వాయనాడ్ లోక్‌సభ సీటుకు ఆమె తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వమంతా కేరళకు తరలివచ్చింది.

పార్టీ నేతలు, శ్రేణులు సోనియా ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికారు.

సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ప్రియాంక, సోనియాగాంధీలు పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

అందుకు సంబంధించిన ఫోటోలు మీ కోసం. వాటిపై ఓ లుక్కేద్దాం.

