BigTV English

OTT Movie : పోలీసులనే పరేషాన్ చేసే సైకో కిల్లర్… ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పోలీసులనే పరేషాన్ చేసే సైకో కిల్లర్… ట్విస్ట్ లతో మైండ్ బ్లాక్ అయ్యే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఈ రోజుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ హవా మామూలుగా కాదు ఒక రేంజ్ లో నడుస్తోంది. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొద్ది రోజుల వ్యవధిలోనే ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటిటి లవర్స్ కు ఎప్పుడూ థ్రిల్లర్ మూవీస్ బోర్ కొట్టవు.  అందుకే థ్రిల్లర్ మూవీస్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తారు.  ఒక బాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ మూవీ థియేటర్ లలో హల్చల్ చేసి ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ లో రొమాంటిక్ సీన్స్ కుర్రకారును బాగా అలరిస్తాయి. ప్రస్తుతం ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? స్టోరీ ఏమిటో తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో

రొమాంటిక్ సన్నివేశాలతో పాటు సస్పెన్స్ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఎక్కువగా ఉన్నాయి. ఆ మూవీ పేరు మరేమిటో కాదు ” వజా తుమ్ హో “(wajah tum ho). ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళ్తే

హీరో వృత్తి రీత్యా ఒక పోలీస్ ఆఫీసర్. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ హత్యలు చేస్తూ ఉంటాడు. హిరోకి వ్యతిరేకంగా ఒక మీడియా ప్రతినిధి టీవీ ఛానల్ లో ప్రకటనలు ఇస్తాడు. అంతే కాదు ఆ చానెల్ లో హత్యలను కూడా ప్రసారం చేస్తారు. తరువాత హీరో ఆ మీడియా ప్రతినిధికి వార్నింగ్ ఇస్తాడు. మీడియా రేటింగ్ పెంచుకోవటానికి మీరే ఇదంతా చేస్తున్నారు అని హీరో అతనితో అంటాడు. అది అవమానంగా భావించిన మీడియా ప్రతినిధి హీరోపై కక్షపెంచుకుంటాడు. అతనిని ఏదైనా చేయాలి అనుకుని ఒక పధకం వేస్తాడు. అలాగే ఆ సైకో కిల్లర్ హత్యలను పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. హీరో ఇన్వెస్టిగేషన్ చేసి మతి పోయే విషయాలను బయటకు తెస్తాడు. ఇందులో హీరోయిన్ మీడియా ప్రతినిధి దగ్గర జాబ్ చేస్తూ , అమాయకంగా కనిపిస్తూనే కొంతమందిని టార్గెట్ చేస్తూ ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకుంటుంది. ఈ మూవీలో చివరి వరకు కిల్లర్ ఎవరో ఎవరికి అర్థం కాదు. అసలు ఆ సైకో కిల్లర్ ఎందుకు హత్యలు చేస్తున్నాడు? హీరో ఆ సైకో కిల్లర్ ని పట్టుకున్నాడా ? హీరోయిన్ కి ఆ హత్యలకి సంబంధం ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న “వాజా తుం హో” (wajah tum ho) మూవీ ని తప్పక చూడాల్సిందే. ఈ మూవీలో రొమాంటిక్ సన్నివేశాలు కనువిందు చేస్తాయి. అలాగే సస్పెన్స్ సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనలకు అందకుండా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పై కూడా ఓ లుక్కేసేయండి. పోలీసులకు సవాలుగా మారే క్రైమ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాను చూస్తే మంచి మజా వస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఇదొక మంచి ట్రీట్.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×